Homeజాతీయ వార్తలుAgricultural: కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి.. ఆశిస్తున్నదేంటి?

Agricultural: కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి.. ఆశిస్తున్నదేంటి?

Agricultural:  ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వరుసగా నాలుగోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే నెల 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా, ఈ సారి రాబోయే బడ్జెట్ ఎలా ఉండబోతున్నదనే చర్చ జరుగుతున్నది. వివిధ వర్గాల ప్రజలకు కేంద్రం ఏ మేరకు ఊరట కలిగించనుంది,? కేటాయింపులు ఎలా ఉంటాయి? అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొవిడ్ మహమ్మారి వలన ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌పైన ఆసక్తి పెరుగుతున్నది.

Agricultural
Agricultural

 

ముఖ్యంగా ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఇచ్చే ప్రయారిటీ గురించి చర్చ జరుగుతన్నది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇకపోతే ఈ సారి కేటాయింపుల్లో వ్యవసాయ రంగ వర్గాలకు చాలా ఆశాలే ఉన్నాయి. ప్రీ బడ్జెట్ మీటింగ్స్‌లో భాగంగా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, రైతు సంఘాలతో సమావేశం అయ్యారు.

Also Read: Social Updates: సినీతారల సంక్రాంతి అప్డేట్స్ మీకోసం..!

ఈ క్రమంలోనే ఈ సారి కేంద్ర బడ్జెట్‌పై వ్యవసాయ రంగ నిపుణుల నుంచి పలు సూచనలు అందాయి. కాగా, ఆ సూచనలను ఏ మేరకు కేంద్రం అమలు చేస్తుందో చూడాలి. ఇకపోతే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు వ్యవసాయ రంగ నిపుణులు సూచించిన విషయాలు ఏమిటంటే.. వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్‌పై అధిక రాయితీలతో పాటు జన్యుపరంగా మార్పు చెందిన జీవుల వంటి కొత్త సాంకేతికతలను గురించి సూచనలు చేశారు. ఇకపోతే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్య రంగ రుణాలను ప్రభుత్వం 25 శాతం పెంచాలని సిఫార్సు చేశారు.

కనీస మద్దతు ధర నిర్ణయించడానికి స్వయం ప్రతిపత్తి కలిపించాలని సూచించారు. ఉత్పాదకతను పెంచడానికిగాను సాంకేతికత వినియోగంపైన దృష్టి పెట్టాలని తెలిపారు. ఇక్రిసాట్, ఐసీఏఆర్ వంటి సంస్థలు అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు ఆమోదం తెలపాలని కోరారు. నరేగాను వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానం చేయాలని కోరారు.

Also Read:2022లో రాబోయే మూవీ సిక్వెల్స్ ఇవే..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

3 COMMENTS

  1. […] USA:  అగ్రరాజ్యం అమెరికాలో తుపాకితో పాటు ఇతర పేలుడు పదార్థాలు కలిగి ఉన్న దుండగుడు వీరంగం సృష్టించాడు. అతడి వీరంగం చూసి అమెరికా ప్రజలు భయపడిపోయారు. అలా సుమారు పది గంటల పాటు దుండగడు భయాందోళనలను క్రియేట్ చేశాడు. ఇంతకీ అలా అతడు ఎందుకు చేశాడంటే.. […]

  2. […] Rohit Sharma:  టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్ డే, టీ 20 కెప్టెన్సీకి దూరమైన నేపథ్యంలో టెస్టు కెప్టెన్సీకి ఇక ఢోకా లేదని అందరూ అనుకున్నారు. కానీ, కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రకటించేశారు కూడా. దాంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular