మన దేశంలో రెండు వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవీ షీల్డ్ ఒకటి. భారత్ భయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ రెండోది. ఈ రెండు వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చిన తొలి నాళ్లలోనే అందరికీ ఓ సందేహం వచ్చింది. ఈ రెండిట్లో ఏది పవర్ ఫుల్? ఏది వేసుకుంటే మంచిది? అనేది ఆ డౌట్.
మొదట్లో ఎవరి మనసులో వారికి ఉందేమోగానీ.. ప్రధాని మోడీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రధాని ఏ వ్యాక్సిన్ తీసుకున్నాడో చెప్పాలని నేరుగా దరఖాస్తులు కూడా వెళ్లాయి. ఆసుపత్రి వర్గాలు ఆ సమాచారాన్ని ఇవ్వకపోవడంతో.. ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. కాగా.. ఈ అంశంపై ఓ రీసెర్చ్ కూడా జరిగింది. దాని ఫలితం ప్రకారం.. ఈ రెండిట్లో ఏది సమర్థమైంది? రెండిటి పనితీరులో తేడా ఎంత అనే విషయాలు తేలినట్టు సమాచారం.
కొవీషీల్డ్, కొవాగ్జిన్ పనితీరు మీద మన దేశానికి చెందిన నిపుణులు అధ్యయనం చేశారని సమాచారం. డాక్టర్ ఏకే శర్మ సారథ్యంలోని నిపుణుల బృందం రీసెర్చ్ చేసి, పలు కీలక అంశాలను గుర్తించిందట. ఈ వ్యాక్సిన్లపై ఇలాంటి ఓ పరిశోధన జరగడం ఇండియాలో ఇదే మొదటి సారి.
వీరి అధ్యయనం ప్రకారం కొవాగ్జిన్ టీకా తీసుకున్న వరిలో 80 శాతం మేర యాంటీ బాడీస్ ఉత్పత్తి అయినట్టు తేలిందట. అయితే.. కొవీషీల్డ్ తీసుకున్నవారిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సమాచారం. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98.1 శాతం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినట్టు నిపుణులు బృందం గుర్తించిందట.
మొత్తంగా చూసుకున్నప్పుడు రెండు టీకాల పనితీరు కూడా బాగుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతోందని తేల్చింది. సెరోపాజిటివిటీ రేటు.. సగటు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైటర్లు మాత్రం కొవిషీల్డ్ లో కాస్త ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్టు తాము గుర్తించామని నిపుణులు చెప్పినట్టు సమాచారం. ఈ అధ్యయనాన్ని ఇంకా పరచురించలేదని, త్వరలోనే పబ్లిష్ చేస్తామని వారు తెలిపినట్టు సమాచారం.