Homeఎంటర్టైన్మెంట్భారీ రెమ్యునరేషన్లతో నిర్మాతల వ్యధ !

భారీ రెమ్యునరేషన్లతో నిర్మాతల వ్యధ !

ఒకప్పుడు సినిమా నిర్మాణం పూర్తిగా నిర్మాత చేతిలో ఉండేది. ఎవరికీ ఎంత ఇవ్వాలి ? దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ? ఇలా డబ్బు విషయంలో నిర్మాతదే పైచేయి. కానీ కాలం మారింది, ఇప్పుడంతా స్టార్లు మాత్రమే సినిమా నిర్మాణాన్ని డిసైడ్ చేస్తున్నారు. హీరో లేదా డైరక్టర్ ఇలా ఎవరికీ ఐతే మార్కెట్ అండ్ క్రేజ్ ఉంటుందో వారే సినిమాని దిశానిర్దేశం చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరక్టర్ల డేట్ లు ఉంటే చాలు, సినిమాకి డబ్బులు అవే పుట్టుకొస్తున్నాయి. అంటే ప్రస్తుత నిర్మాత పరిస్థితి మేనేజర్ స్థితి అన్నమాట.

అందుకే నేటి నిర్మాత కేవలం డబ్బులు జల్లేయడానికి మాత్రమే పనికొస్తున్నాడు. హీరోలు, డైరక్టర్లు అడిగినంత ఇస్తేనే పెద్ద సినిమా చేతికి అందుతుంది. అయితే రానురాను మీడియం రేంజ్ హీరోలు, డైరక్టర్లు కూడా ఇప్పుడు నిర్మాతలను డిమాండ్ చేసున్నారు. పారితోషికాల కోసం భారీ డిమాండ్లు చేస్తున్నారు. దాంతో సినిమా ప్రొడక్షన్ లో చాలా కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మొత్తానికి రెమ్యూనరేషన్ విధానాల్లో కూడా రోజులు మారేకొద్దీ మార్పులు వస్తున్నాయి. దాంతో పెద్ద వాళ్లకు ఎక్కువ చిన్న వాళ్లకు తక్కువ అనే పద్దతిని నిర్మాతలు ఫాలో అయిపోతున్నారు. అసలు సినిమా బడ్జెట్ లో ముప్పావు శాతం హీరోలు, డైరక్టర్ల రెమ్యునరేషన్ కే సరిపోతుంది. నేడు టాప్ స్టార్ హీరోలు యాభై నుంచి అరవై అయిదు కోట్ల రేంజ్ లో తీసుకుంటున్నారు.

పవన్ తన వకీల్ సాబ్ కు 65 కోట్లు తీసుకున్నారని టాక్ ఉంది. మహేష్ రెమ్యూనరేషన్ ఇంత అని తెలియదు గానీ, ఇంచుమించు పవన్ రేంజ్ లోనే ఉంది మహేష్ రెమ్యూనరేషన్ కూడా. ఇక ప్రభాస్ నేషనల్ స్టార్. హిందీలో భారీ మార్కెట్ ఉంది. రెమ్యునరేషన్ ఎనభై కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా ఆ రేంజ్ లోనే ఇస్తున్నారు.

వీళ్ల తరువాత బన్నీ రెమ్యూనరేషన్ ఎక్కువ వుంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు 35 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ హీరోలు వెంకీ, నాగ్ మొన్నటి వరకు అయిదారు కోట్ల రేంజ్ లోనే వున్నారు. బాలయ్య పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. రవితేజ కూడా పట్టుబట్టి ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు.

ఏవరేజ్ రేంజ్ హీరోల విషయానికి వస్తే.. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు తొమ్మిది నుంచి పది కోట్ల రేంజ్ లో ఉన్నారు. శర్వానంద్, నితిన్, గోపీచంద్ కూడా ఏడు ఎనిమిది దగ్గర ఉన్నారు. చిన్న హీరోల రెమ్యూనరేషన్ కోటి నుండి రెండు కోట్ల మధ్యలో ఉంది. అలాగే స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లు కూడా భారీ మొత్తంలో తీసుకుంటున్నారు. మొత్తానికి రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు గుల్ల అవుతున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణం దారుణంగా ఉంది. భారీ రెమ్యూనరేషన్లతో నిర్మాతలు వ్యధ చెందుతున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version