YS Vijayamma: వైఎస్ విజయమ్మ.. పరిచయం అక్కర్లేని పేరు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి. భర్త బతికున్నంత కాలం ఆమె రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు. కేవలం భర్తతో పాటు ప్రోటోకాల్ ప్రకారం కొన్ని వేదికలు మాత్రమే పంచుకునేవారు. రాజకీయాల వైపు చూసేవారు కాదు. అటువంటిది భర్త అకాల మరణం తరువాత ఏర్పడిన పరిస్థితులతో కుమారుడు జగన్ భవిష్యత్ కోసం రాజకీయ తెరపైకి వచ్చారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. పార్టీకి అండదండగా నిలిచారు. వైసీపీ అధికారంలోకి రావడానికి తన వయోభారం లెక్క చేయకుండా క్రుషి చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి… జగన్ గద్దెనెక్కాక ఆమె ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఆమెకు పార్టీలో కనీస ప్రాధాన్యత లేదు. పేరుకే గౌరవ అధ్యక్షురాలు కానీ.. గౌరవమన్నది గణనీయంగా తగ్గింది. ఇందుకు కుటుంబ రాజకీయాలే కారణమని టాక్ నడుస్తోంది.
సీఎం జగన్ తన భార్య భారతికి ఇస్తున్న ప్రాధాన్యత తల్లి విజయమ్మకు ఇవ్వడం లేదని పార్టీ వర్గాలే అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులైతే తెగ బాధపడుతున్నారు. ప్రస్తతుం పార్టీలో నడుస్తున్న వ్యవహారాలపై ఆవేదనతో ఉన్నారు. ఏటా ఆమె జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ఎక్కడా నిర్వహించిన దాఖలాలు లేవు.వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి గ్రామ స్థాయి కార్యాలయం దాకా కేక్ కటింగ్‌లు గానీ ఎక్కడా కనిపించలేదు. పోనీ.. ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారమనుకుంటే.. కనీసం సామాజిక మాధ్యమాల్లోనైనా విజయలక్ష్మికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా అంటే అదీ లేదు. దీంతో పార్టీలో ఇది చర్చనీయాంశమైంది. ఉద్దేశపూర్వకంగా ఆమెను సైడ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. జగన్ సోదరి షర్మిళ తెలంగాణాలో పార్టీ ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో తోబుట్టువులు ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. కుటుంబంలో కూడా విభేదాలు భగ్గమన్నాయన్న వార్తలు నడిచాయి. దీంతో విజయమ్మ షర్మిళ వైపు మొగ్గుచూపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైదొలుగుతానని హెచ్చరికలు సైతం జారీచేశారు. అయితే కుటుంబ శ్రేయోభిలాషులు వద్దని వారించడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే తాజాగా ఆమె జన్మదినోత్సవాలను పక్కన పెట్టడం పొమ్మన లేక పొగ పెట్టడమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Raveena Tandon: పార్టీలో రచ్చ.. కేకలు పెట్టిన సీనియర్ హీరోయిన్ !
అమ్మ కంటే హరియాణా సీఎంకు ప్రాధాన్యం
సహజంగా ప్రత్యేక సందర్భాలు, రోజుల్లో జగన్ ట్విట్టర్ ద్వరా సందేశాలిస్తుంటారు. తన మాతృమూర్తి జన్మదినంనాడు కనీసం అలాగైనా సందేశమివ్వలేదు. ఇదేంటి.. ఇలా జరిగిందేమిటని వైసీపీ శ్రేణులు, నేతలు ఆశ్చర్యపోతున్నారు. మంగళవారం విజయవాడకు సమీపంలోని ఖమ్మం జిల్లాలోనే విజయలక్ష్మి పర్యటిస్తున్నారు.
తన తల్లికి ఫోన్లోనో, ట్విటర్‌లోనో కాకుండా వ్యక్తిగతంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకుంటే గంట వ్యవధిలోనే పని. ఖమ్మంలో ఆమె బస చేసిన చోటికి కాసేపట్లోనే వెళ్లవచ్చు. కానీ జగన్ తల్లి వద్దకు వెళ్లలేదు సరికదా.. విశాఖలో ప్రకృతి చికిత్సను పొందుతున్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను పనిగట్టుకొని పరామర్శకు వెళ్లారు. ఖట్టర్ బీజేపీ ముఖ్యమంత్రి. జగన్ కు అంతకు ముందు పరిచయం లేదు. వారి మధ్య పరామర్శించేటంత స్నేహమూ లేదు. బీజేపీ సీఎంను పరామర్శించిన ఆయన.. తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కాగా,సొంత కొడుకు గానీ, పార్టీ నేతలు గానీ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పకపోవడంతో విజయలక్ష్మి నొచ్చుకున్నతెలుస్తోంది.
ఆ ట్విట్ తో విజయసాయి అవుట్
అయితే జగన్ కు వీరవిధేయుడు ఎంపీ విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందుకేసి విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయనకు తెలిసి చేశారో.. లేకుండా యాద్రుశ్చిక మో జరిగిందో తెలియదు కానీ.. ఆ తరువాత పరిణామాలు శర వేగంగా మారిపోయాయి. అదే రోజు పార్టీ సమన్వయకర్తల నియామకంలో ఆయన పేరు లేకుండా పోయింది. అప్పటి వరకూ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్న విజయసాయి పేరు జాబితాలో కనిపించలేదు. ఆయన స్థానాన్ని వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు..అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలపై జగన్ 16 నెలలు జైలులో ఉన్నప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ వెన్నంటే ఉన్నారు. అటువంటి విజయసాయికి ప్రాధాన్యత తగ్గించడం. జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకవైపు అమ్మ, మరోవైపు సోదరి షర్మిల తోడున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విజయమ్మతో పాటు షర్మిళను కూరలో కరివేపాకులా తీసేశారన్న సందేహాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయు. ఈ నేపథ్యంలో జూలై 8వ తేదీన నిర్వహించే వైసీపీ ప్లీనరీలో గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలగబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read:Nellore Politics: నెల్లూరి వైసీపీలో ఆగని రచ్చ.. సీఎం జగన్ జోక్యం చేసుకున్నా ఫలితం శూన్యం
Recommended Videos:
Web Title: Will ys vijayamma resignation ycp honorable president post
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com