NTR Fans: తన భార్యను అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు దూషించారని చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిణామం అతిపెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరికి జరిగిన అవమానంగా భావిస్తున్న బాలకృష్ణ, పురంధరేశ్వరి, కళ్యాణ్ రామ్ తో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనే సందేహం టీడీపీ వర్గాలలో నెలకొంది.
Also Read: అప్పుడు మహేష్ బన్నీ మధ్య జరిగిన గొడవే… ఇప్పుడు ఆర్ఆర్ఆర్ భీమ్లా నాయక్ మధ్య!

అయితే ఎన్టీఆర్ ఈ ఘటనపై మాట్లాడారు. రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ల వ్యక్తిత్వంపై దాడి నీచ సంస్కృతి గా అభివర్ణించారు. ఇది అరాచక పాలనకు నాంది, దీనిని ఇంతటితో వదిలేసి, ఇకపైన పునరావృతం చేయకుండా ఉంటే మంచిది అంటూ వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ స్పందన టీడీపీ వర్గాలకు నచ్చలేదు. ఆయన సీఎం జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేల పేరు ఎత్తకుండా డిప్లమాటిక్ గా మాట్లాడడాన్ని వాళ్ళు విమర్శిస్తున్నారు.
ఎవరో ఒక అనామకుడు ఎన్టీఆర్ ఫ్యాన్ అంటూ ఆయన్ని విమర్శిస్తూ చేసిన వీడియోను వార్తా కథనంగా కూడా ఓ మీడియా సంస్థ రాయడం జరిగింది. ఆ తరహాలో ఎన్టీఆర్ పై దాడికి దిగడం ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. టీడీపీలోని ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ తో పాటు పార్టీలకు అతీతంగా అభిమానించే వారు… ఈ చర్యలను ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ జోలికి వస్తే బాగోదు అంటూ… గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.దీనితో చంద్రబాబు జగన్ గొడవ కాస్తా, టీడీపీ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అన్నట్లు మారింది.
చాలా కాలంగా టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ అనుకూలురు, వ్యతిరేకులు ఉన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ సమర్థత పై నమ్మకం లేని టీడీపీ క్యాడర్ ఎన్టీఆర్ వైపు మళ్లింది. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్ వర్గం ఎన్టీఆర్ పై సమయం దొరికినప్పుడల్లా దాడికి దిగుతున్నారు. ఓ దశలో ఎన్టీఆర్ కుటుంబాన్ని బాబు పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు, టార్గెట్ చేయడం జరిగింది.
Also Read: రామ్ చరణ్, ఎన్టీఆర్ ల “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ట్రైలర్ కి టైమ్ ఫిక్స్… ఎప్పుడంటే ?