AP News: అన్ని ప్రేమలు సఫలం కావు. ప్రేమికులు ఒక్కటిగా జీవించడానికైనా మరణించడానికైనా సిద్ధంగా ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమించుకునే వారు ఎందరో ఉన్నా జన్మాంతం ప్రేమలో తరించాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకోకపోయినా జీవితాంతం విడిపోయి ఉందామని అర్థం చేసుకునే వారు కూడా ఉన్నారు. సమాజంలో ప్రేమికులు ఎన్నో కష్టాలున్నా తమ ప్రేమ సఫలం కావాలని ఆశించే వారే ఎక్కువ. నిజమైన ప్రేమకు అంత విలువ ఉంటుంది. ప్రాణాలు సైతం లెక్కచేయనంత సాహసం వారి సొంతం.
Also Read: ప్రియుడు మాట్లాడడం లేదని డయల్ 100కు ఫోన్ చేసిన లవర్

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పులిచర్ల అనిల్ కుమార్ అనే యువకుడు ప్రేమలో పడ్డారు. ఇద్దరు తరచూ కలుసుకుని తమ ఊసులు చెప్పుకునే వారు. ఇద్దరి ప్రేమ విషయం వారి ఇళ్లల్లో తెలియడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారు పెద్దలను ఎదిరించాలని అనుకున్నారు.
ఈ నెల 18న అరుణ్ బాలికను బైక్ పై ఎక్కించుకుని కొత్తగూడెం-యార్రావారి గూడెం గ్రామాల మధ్య ఉప్పు వాగు సమీపంలో పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి విషమించడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి గంటల వ్యవధిలో ఇద్దరు విగతజీవులయ్యారు.
మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22) అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకోగా పెద్దలు అడ్డు చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉరేసుకున్నారు. దీంతో రెండు జంటలు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడంపై అందరిలో ఆందోళన నెలకొంది. పెద్దలు ప్రేమలను ఒప్పుకోకపోవడంతోనే ఇలా విగతజీవులుగా మారుతున్నారని తెలుస్తోంది.
Also Read: ఇద్దరు పిల్లలున్నా ప్రేమలో పడిన మహిళ.. ప్రియుడిపై యాసిడ్ దాడి