Amaravathi: అమరావతి రైతుల అలుపెరగని పోరాటానికి తిరుపతిలో ముగింపు పడింది. ఆది నుంచి ఈ పోరాటానికి ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన చంద్రబాబే చివరకు ఈ ముగింపు సభకు అతిథిగా వచ్చి ‘ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతియే’ అని స్పష్టం చేశారు. పనిలో పనిగా టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుతో ఓ రూ.5 లక్షల విరాళాన్ని రైతుల పోరాటానికి ఇచ్చి మమ అనిపించారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడితే ఒప్పుకోను అని జగన్ కు సవాల్ చేశారు.
అమరావతి(Amaravathi) రైతులకు సీపీఐ, సీపీఎం మద్దతు పలికాయి. జనసేనాని పవన్ హాజరు కాకుండా సందేశాన్ని పంపారు. పరోక్షంగా మద్దతునిచ్చారు. ఇక బీజేపీ కూడా ఈ అమరావతి ఉద్యమంలో పాలుపంచుకొని తాము సైతం అని ర్యాలీలు తీసింది.ఇప్పుడు చంద్రబాబు దగ్గరుండి ఈ అమరావతి రైతుల ఆందోళనకు ముగింపు పలికారు.
Also Read: ఏపీలో ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చిన అమరావతి రైతులు..
చంద్రబాబు తిరుపతి సభ సాక్షిగా ‘అమరావతి’ ఒక్కటే రాజధాని అని నినదించారు. మాట తప్పను అన్న జగన్.. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారం సాధించాక వ్యతిరేకించడం భావ్యమా అని నిలదీశారు. 180మంది ఇప్పటిదాకా చనిపోయారు. వేల కేసులు పెట్టారు. ఇన్ని చేసినా అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు ఇన్నాళ్లు నడిపిన తీరు సాహసమనే చెప్పాలి.
అయితే ఎన్ని ఆందోళనలు చేసినా.. గొంతు చించుకున్నా.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా జగన్ మనసు కరిగే ఛాన్స్ కనిపించడం లేదు. ఆయన మూడు రాజధానులపై ‘తగ్గేదేలే’ అన్నట్టుగానే ఉన్నారు. దీంతో ఈ వ్యయప్రయాసలు వృథా అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జగన్ ఊపు చూస్తుంటే మరో ఐదేళ్లు ఖచ్చితంగా అధికారంలో ఉంటాడని అనిపిస్తోంది. చంద్రబాబు ఏడుపులు చూస్తే టీడీపీ వారిలోనే నైతికస్థైర్యం దెబ్బతింది. సో చంద్రబాబు సీఎం అయితే కానీ అమరావతి ముందుకు కదలదు. ఆయన అయ్యే పరిస్థితి లేదు. సో ఇప్పట్లో అమరావతి రైతుల పోరుయాత్ర ఆగదు. జగన్ మూడు రాజధానులపై తగ్గడు. మరి చంద్రబాబు ఈ తిరుపతి సభతోనే ముగిస్తారా? లేదా మరో రూపంలో కొనసాగిస్తాడా? అన్నది వేచిచూడాలి.
Also Read: టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!