ఈటల చేరికతో బీజేపీకి లాభం చేకూరేనా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మాజీ మంత్రితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తరువాత అధికారికంగా పార్టీలో చేరడమే తరువాయి. ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హుజురాబాద్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. రాష్ర్టంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే […]

Written By: Srinivas, Updated On : June 1, 2021 5:15 pm
Follow us on

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మాజీ మంత్రితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తరువాత అధికారికంగా పార్టీలో చేరడమే తరువాయి. ఇప్పటికే మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హుజురాబాద్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు.

రాష్ర్టంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈటల భవిష్యత్తుపై నెలరోజులుగా వచ్చిన ఊహాగానాల నేపథ్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.

ఈటలను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ హుజురాబాద్ చేపడుతున్నారు. మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సంయుక్తంగా హుజురాబాద్ ప్రాంత ప్రజలపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు సాగాలని భావిస్తున్నారు. బీజేపీలో చేరే విషయంలో ఊగిసలాట ధోరణితో వ్యవహరించినా ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏర్పడింది. జేపీ నడ్డాను కలవడంతో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ 17 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ పై టీఆర్ఎస్ కు పట్టు సడలలేదని చెప్పేందుకు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో తిష్ట వేసేందుకు పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడ జరిగిన పనుల్లో బిల్లులను మంజూరు చేయడంతో పాటు కార్యకర్తలకు అండగా ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. దీంతో హుజురాబాద్ ప్రాంతంలో విజయం దక్కించుకునేందకు అందరు ప్రయత్నిస్తున్నారు.