https://oktelugu.com/

Putin India Tour: భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొత్త స్నేహానికి దారితీస్తుందా..?

Putin India Tour: అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యానికి భారత్ వ్యతిరేకిస్తే, రష్యా పరోక్ష మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించడం ఆసక్తిగా మారింది. పుతిన్ భారత్ పర్యటిస్తున్న సందర్భంగా అనేక చర్చలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పుతిన్ ఇతర దేశాల్లో పర్యటించడం చాలా తక్కువ. కరోనా విజృంభణ తరువాత ఆయన జెనీవాకు మాత్రమే వెళ్లారు. ఆ తరువాత భారత్ కు వస్తున్నారు. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 09:43 AM IST
    Follow us on

    Putin India Tour: అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యానికి భారత్ వ్యతిరేకిస్తే, రష్యా పరోక్ష మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించడం ఆసక్తిగా మారింది. పుతిన్ భారత్ పర్యటిస్తున్న సందర్భంగా అనేక చర్చలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పుతిన్ ఇతర దేశాల్లో పర్యటించడం చాలా తక్కువ. కరోనా విజృంభణ తరువాత ఆయన జెనీవాకు మాత్రమే వెళ్లారు. ఆ తరువాత భారత్ కు వస్తున్నారు. దీంతో తాలిబన్ల విషయంలో భారత్ కు అభయం ఇవ్వడానికే పుతిన్ భారత్ పర్యటన చేస్తున్నాడా..? అనే చర్చ సాగుతోంది. భారత్ కు శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాకు రష్యా సహకారం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు భారత్ లో పర్యటించడంపై హాట్ టాపిక్ గా మారింది.

    Putin India Tour

    భారత్, రష్యా మధ్య సుధీర్ఘ కాలంగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. 2018లో పుతిన్, మోదీ భేటీ అయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మోదీ, పుతిన్ లు వాటిపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పడిన తరువాత రష్యా మద్దతు పలికింది. కానీ భారత్ వ్యతిరేకించింది. అయితే ఈ విషయంలో భారత్ కు సహకరిస్తామని రష్యా తెలిపింది. అయితే ఇదే విషయంపై క్వాడ్ పునరుద్ధరణ చేశారు. దీనికి భారత్ మద్దతు ఇవ్వడం రష్యాకు పరోక్షంగా నచ్చని విషయం.

    ఇటీవల క్వాడ్ సభ్య దేశాలు సమావేశమయ్యాయి. క్వాడ్ లో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ సమావేశంలో కొవిడ్ పై చర్చ తో పాటు దక్షిణ సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడంపై చర్చించారు. అయితే క్వాడ్ పై రష్యా వ్యతిరేక కామెంట్లు చేసింది. దానిని ‘ఆసియన్ నాటో’గా అభివర్ణించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)..రష్యాకు ప్రధాన శత్రువు. అందుకే క్వాడ్ ను ఆసియన్ నాటోగా పేర్కొంది. ఇక అమెరికా, చైనా గొడవ వస్తే భారత్.. అమెరికాకు మద్దతు ఇచ్చే అవకాశం ఉండగా.. రష్యా.. చైనా సంతకు చేరుతుంది. రష్యాకు, చైనాతో మంచి సంబంధాలున్నాయి. అమెరికాపై ఈ రెండు దేశాలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి. సైద్ధాంతిక, చరిత్ర వంటి అంశాల్లో చైనా, రష్యాలు ఒక్కటవుతూ ఉంటాయి. అయితే భారత్ కు రష్యాతో మంచి సంబంధాలున్నా.. చైనాతో ఎప్పుడూ వ్యతికంగానే ఉండాల్సి వస్తోంది.

    మోదీ అధికారంలోకి రాగానే విదేశాల పర్యటనలను చేశారు. ఇందులో భాగంగా రష్యాకు వెళ్లి పుతిన్ ను కలుసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహానికి బీజం పడింది. ఇరు దేశాలు తమ విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించేందుకు భారత్ లో ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ ఏర్పరుచుకున్నాయి. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం ద్వారా ఆ సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో భారత్ రష్యా నుంచి ఆయుధాలు కొనడం మొదలుపెట్టింది. కానీ ఇటీవల కాలంలో అది 50 శాతం తగ్గింది. ఇప్పడు ఆ విషయంపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

    Also Read: Indian CEOs: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ దిగ్గజ కంపెనీల్లో భారతీయులకే అత్యున్నత పదవులు.. ఎందుకు..?

    అయితే ఈ సానుకూల సమస్యల పరిష్కారానికి దారి తీస్తుందా..? అనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇతర భాగస్వాములు అసంతృప్తి చెందకుండా, సమతుల్యత సాధించడానికి ఇరు దేశాలు చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలంటున్నారు. అయితే వ్యక్తిగత స్నేహాలు ప్రేమను పెంచుతాయి గానీ.. సమస్యల పరిష్కారానికి పనికి రావు అని కొందరు విమర్శిస్తున్నారు. మరి ఈసారి పుతిన్ పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.

    Also Read: Exploitation of investors : నేను, నా దేశం.. ఓ పెట్టుబడిదారుడు..