తెలంగాణలో ఇప్పుడు హూజురాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ అనివార్యమైంది. అయితే నోటిఫికేషన్ కు ఇంకా సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ఇక్కడ రాజకీయ సమీకరణగాలు ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయన టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంకా ఎవరు చెప్పకపోయినా నిన్న కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ చాలా ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ రెండో ప్లేసులో ఉంది. ఈసారి ఆ ప్లేసు ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక తరువాత కాంగ్రెస ఏ ఎన్నికలోనైనా మూడో ప్లేసులోనే ఉంటోంది. దీంతో నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని భావించిన అధిష్టానం రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పింది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ గా నియామకం కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు నిరాశగా ఉన్న నాయకుల్లో తాము అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారుతామనే ఆశ కలుగుతోంది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పటిష్టతను తెలపాలని ఆ పార్టీ నాయకులు తహతహలాడుతున్నారు.
అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ధీటైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. అయితే ఆషామాషిగా కాకుంవా సర్వే నిర్వహించి ప్రజల్లో పట్టున్న నాయకుడికి టికెట్టు ఇవ్వాలన ఆలోచనలో పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలుపు, ఓటములు పక్కనబెట్టి సెకండ్ ప్లేసును భర్తీ చేస్తే వచ్చే ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహరించవచ్చని అనుకుంటున్నారు.
ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషంలో అధికార పార్టీ సైతం ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో తమ పార్టీ నుంచి కూడా సర్వేలు నిర్వహించి మంచి నాయకుడిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. తాను పీసీసీ చీఫ్ పదవి చేపట్టిన తరువాత ఇది మొదటి సవాల్ గా భావిస్తున్నారు రేవంత్. ఇక్కడ సక్సెస్ అయితే నెక్ట్స్ జరిగే ఎన్నికల్లో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం తీసుకొచ్చి ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. మరి రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? చూడాలి..