
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డిని ప్రటిస్తున్నారని ప్రచారం సాగుతున్నా అదే పార్టీలోని కొందరు పె ద్దలు అడ్డు చె బుతున్నారని తెలుస్తోంది. అందుకే ఆయనపై మళ్లీ ఇటీవల కాలంలో ఓటుకు నోటు కేసులో చార్జీషీట్లు, ఇతర ప్రచారాలు జరుగుతున్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఆయనపై కేసులు పెట్టి అరెస్టు చేయించినట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ కానివ్వకుండా కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీల నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డికి పదవి దక్కకుండా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ ను టార్గెట్ చేస్తూ పదవికి దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలు నేతలు అంతర్గతంగా సహకరిస్తున్నారని సొంత పార్టీ వారే చెబుతున్నారు. హైకమాండ్ వద్దకు ఫిర్యాదులు చేయడం, రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే తాము పార్టీలో ఉండమని వె ళ్లిపోతామని సీనియర్ నేతలు బెదిరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకో వాలో అనే దానిపై సందిగ్ధంలో పడిపోయింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోతోంది. యువతరానికి పగ్గాలు అప్పగించకపోతే పార్టీ కోలుకోలేదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీ తెలంగాణలో ఊపిరిపోసుకుంటుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. గోడ మీది పిల్లులు ఉంటే ఉంటారు లేదంటే వేరే పార్టీలోకి వెళితే పోనీ అనే ధోరణిలో అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.