https://oktelugu.com/

Revanth Reddy: కాంగ్రెస్ తో కేసీఆర్? కొత్త పార్టీ దిశగా రేవంత్ రెడ్డి?

తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి అతి త్వరలోనే కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నాడని సంకేతాలు అందుతున్నాయి. కేసీఆర్ గత రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నట్టు చూస్తే ఆయనకు ఓ క్లారిటీ వచ్చింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించిన కేసీఆర్ అది సాధ్యం కాదని తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణంగా థర్డ్ ఫ్రంట్ లోని కీలకమైన తమిళనాడు సీఎం స్టాలిన్.. కాంగ్రెస్ తో పొత్తులో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2022 8:46 pm
    Follow us on

    తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి అతి త్వరలోనే కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నాడని సంకేతాలు అందుతున్నాయి. కేసీఆర్ గత రెండు మూడు రోజుల నుంచి మాట్లాడుతున్నట్టు చూస్తే ఆయనకు ఓ క్లారిటీ వచ్చింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు నడుం బిగించిన కేసీఆర్ అది సాధ్యం కాదని తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

    దీనికి ప్రధాన కారణంగా థర్డ్ ఫ్రంట్ లోని కీలకమైన తమిళనాడు సీఎం స్టాలిన్.. కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నారు.ఇక మమతా బెనర్జీ కాంగ్రెస్ తోనే ముందుకెళుతోంది. ఇక మహారాష్ట్రలోని శివసేన సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం కాంగ్రెస్ పొత్తుతోనే సీఎంగా ఉన్నారు. బీహార్ లోని తేజస్వి యాదవ్ సైతం కాంగ్రెస్ అండతోనే పోయిన సారి ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు.

    దీంతో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని.. కాంగ్రెస్ సపోర్టుతోనే మోడీని ఓడించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ గత రెండు రోజుల నుంచి మాట్లాడడం ఆశ్చర్యపరిచింది.

    దీన్ని టీఆర్ఎస్ అతి త్వరలోనే కాంగ్రెస్ కు దగ్గరవుతోంది. దీనికి తెలంగాణలోని ఓ కాంగ్రెస్ ఎంపీ కూడా తోడ్పడుతున్నాడని.. కేసీఆర్, సోనియా, రాహుల్ మధ్య సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్.

    అయితే కాంగ్రెస్ తో కేసీఆర్ కలిస్తే ఆయన బద్ద శత్రువు.. తీవ్రంగా వ్యతిరేకించే రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంటి? కేసీఆర్ అంటే కస్సుమని లేచే రేవంత్ ఆ పార్టీలో ఉంటారా? లేక కొత్త పార్టీ దిశగా ఆలోచన చేస్తున్నాడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    తెలంగాణాలో వేగంగా మారుతున్న రాజకీయాలు | Will Revanth Reddy Form A New Regional Party | View Point