Homeజాతీయ వార్తలుTelangana Assembly Election: రంగంలోకి అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్‌ ప్రచారం కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తాయా?

Telangana Assembly Election: రంగంలోకి అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్‌ ప్రచారం కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తాయా?

Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్‌ మరో మూడు రోజుల్లో రానుంది. దీంతో మూడు పార్టీలు ప్రచారం ఉధృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మొదటి విడత ఏడు సభలతో ప్రచారం పూర్తి చేసుకుని రెండో విడతలో కూడా 15 సభలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్‌ కూడా మొదటి, రెండో విడత బస్సుయాత్రలు నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో కూడా కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహించింది. బీజేపీ తరఫున అమిత్‌షా రెండు సభలు, రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు ప్రచారం చేశారు. అయితే బీజేపీ అభ్యర్థుల ప్రకటన పూర్తికాకపోవడంతో ప్రచారంలో కాస్త వెనుకబడింది.

కాంగ్రెస్‌ దూకుడు..
ఒకవైపు హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతుంటే.. మరోవైపు కాంగ్రెస్‌ దీటుగా దూకుడు పెంచుతోంది. అటు మేనిఫెస్టో విషయంలోనూ కాంగ్రెస్‌ గ్యారంటీలనే కాపీ కొట్టిందని ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఏం చేసేది చెబుతోంది. మరోవైపు మేనిఫెస్టో రెడీ చేస్తోంది.

త్రిముఖ వ్యూహంతో..
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తోంది. పార్టీలోనూ నేతలు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఇక ప్రచారం విషయంలో త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు జాతీయ నేతలు, మరోవైపు టీపీసీసీ పెద్దలు, ఇంకోవైపు అభ్యర్థులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏయే నియోజకవర్గాలో జాతీయ నేతలు ఎప్పుడు పర్యటించేది షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు.

నేడు ప్రియాంక, రేపు రాహుల్‌..
ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం ఉధృతం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈమేరక మంగళవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో మూడు సభలు నిర్వహించేలా టీపీసీసీ ఏర్పాటు చేసింది. కొల్హాపూర్, మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు రాహుల్‌ నవంబర్‌ 1న తెలంగాణకు రానున్నారు. రెండు రోజులు బస్సుయాత్రద్వారా ఆరు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీపీసీసీ ప్రణాళిక, రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసింది. మొత్తంగా కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలతోనే కాంగ్రెస్‌ తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మరి రాహుల్, ప్రియాంక ప్రచారం, టీపీసీసీ వ్యూహాలు బీఆర్‌ఎస్‌ స్పీడుకు ఏమేరకు బ్రేక్‌ వేస్తాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version