Modi: అవినీతి రహిత పాలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని ప్రధాని మోడీ ఒక వైపు చెబుతున్నా దేశంలో అవినీతి పెట్రేగిపోతోంది. ఆయన మంచి వారే కానీ పార్టీలో కొన్ని విచ్చిన్నకర శక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెబుతున్నారు. బీజేపీ అవినీతిని అంతం చేస్తుందని 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మోడీ చెప్పిన మాటలను అందరు విశ్వసించారు. కానీ కాల క్రమంలో పరిస్థితులు మారిపోయాయి.

ఒక నీరవ్ మోదీ కానీ మరో ఇంకెవరైనా కానీ ప్రభుత్వాన్ని చూపించి తమ పనులు కానిచ్చేసుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అనుమానాలు వస్తున్నాయి. కర్ణాటక, గోవా, మహారాష్ర్ట స్టేట్లలో ప్రతి పనికి ఓ రేటు పెట్టుకున్నారు. పనికి ముందే అధికారులు, ప్రజాప్రతినిధులు వారి పర్సంటేజీలు తీసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో అవినీతి ఎంతలా వ్యాపించిందో తెలుస్తోంది.
మరోవైపు నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు ఒక్క పైసా కూడా రప్పించకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. దొంగ డబ్బును లెక్కలోకి తీసుకొస్తే దేశంలో పేదరికం అనేదే ఉండదని తెలిసినా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం సాగడం లేదు. దీంతో బీజేపీ అవినీతి రహిత పాలన కోసం ఏం చర్యలు తీసుకుంటుందో ఇప్పటివరకు వెల్లడించడం లేదు. దీంతో అందరిలో సందేహాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది.
Also Read: PM Modi: ప్రధాని చేసిన ఈ పనికి నెటిజన్ల ప్రశంసలు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
కాంగ్రెస్ పాలనతో అవినీతి పెరిగిపోయిందనే ఉద్దేశంతోనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టినా ఫలితం మాత్రం కనిపించడం లేదనే వాదనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021 జనవరిలో విడుదలైన సూచీలో మనదేశం 86వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో కుంభకోణాలు పెరిగిపోయిన క్రమంలోనే ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారు.
దీంతో బీజేపీపై అంచనాలు భారీగానే ఉన్నా ఆ స్థాయిలో చర్యలు ఉండడం లేదని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకోవాల్సిన బాధ్యతలను గుర్తించాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వం తన శాయిశక్తులా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. దీని కోసం బీజేపీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: Akhilesh Yadav: బాబాయ్‌తో అఖిలేశ్ పొత్తు.. విభేదాలు పక్కన పెట్టిన శివపాల్..