Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి ఒక లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మన ఊరు- మన బడి ప్రోగ్రామ్ చాలా బాగుందని మంచు లక్ష్మీ ప్రశంసించింది. అయితే డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ట్రైనర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించింది.

ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని రిక్వెస్ట్ చేసింది. తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తానికి మంచు లక్ష్మీ లేఖకు కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అయితే, కేటీఆర్ తో మంచు లక్ష్మీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మంచు లక్ష్మీ ట్వీట్స్ కి కేటీఆర్ స్పందించిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి.. ఈ సారి కూడా మంచు లక్ష్మీ లేఖకు కేటీఆర్ స్పందిస్తాడని అంటున్నారు.
Also Read:థర్టీ ప్లస్ లో విడాకులు… సమంత-చైతూలలో మొదట శుభవార్త చెప్పేదెవరు?

ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలను తగ్గించింది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కథలు, పాత్రల ఎంపికలో ఆమె కాస్త కఠినంగా ఉంటుంది. పైగా కేవలం పారితోషికం కోసం సినిమాలు చేయను అని, సినిమాల ద్వారా తాను గుర్తింపును మాత్రమే కోరుకుంటున్నానని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పింది. అయితే, మంచు లక్ష్మి ఇష్టపడి చేసిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.
Also Read: టీడీపీకి ఆయుధం దొరికినట్టేనా? మరి మంత్రి కొడాలి నాని పరిస్థితి ఏంటి?