NTR-Charan: జగన్ రాజకీయం పై ప్రస్తుతం సినీ పరిశ్రమలో లోలోపలే ప్రకంపనలు రేగుతున్నాయి. థియేటర్ టికెట్ రేట్ల విషయంలో జగన్ తీరు ఏ మాత్రం సమంజసం కాదు అని సినిమా వాళ్ళ అభిప్రాయం. నిజానికి స్పందించాల్సిన రీతిలో మొదటే సినిమా వాళ్ళు స్పందించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. కానీ చాలా లేట్ గా స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు వ్యవహారం పై ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు.

టికెట్ ధరల తగ్గింపు అనేది పెద్ద సినిమాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. దానయ్య మాటల్లోనే ‘‘ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించడం అనేది కచ్చితంగా మా చిత్రం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయిచడం లేదు.
కానీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి మా పరిస్థితిని తెలియజేస్తాము. మాకు న్యాయం జరిగేలా తగిన పరిష్కారాన్ని కోరుతాము’’ అంటూ మెసేజ్ చేశాడు. మరి ఎన్టీఆర్ – చరణ్ కలిసి వెళ్తే జగన్ నిర్ణయం మారుతుందా ? రీసెంట్ గా ఏపీలో టికెట్ రేట్లపై చర్చించి సినిమా ఇండస్ట్రీ ప్రధాన సమస్యను పరిష్కరించాలని నాగార్జున జగన్ ను కలసి కోరాడు. కానీ నాగ్ అడిగితే చేసేందుకు జగన్ రెడీగా లేడు.

అసలు సినీ పెద్దలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా జగన్ ఆలోచిస్తున్నాడు. అలాంటిది వాళ్ళ కోరికల చిట్టాను ఎందుకు పట్టించుకుంటాడు ? అయినా పెద్ద సినిమా పేరుతో డబ్బా థియేటర్ లో కూడా టికెట్ కాస్ట్ 300 నుంచి 400 రూపాయిలు పెట్టి వసూలు చేస్తే.. దీన్ని దోపిడీ అనకుండా ఎలా ఉండగలం ?
100 రూపాయిల టికెట్ పెద్ద సినిమాల ఓపెనింగ్ రోజు మాత్రం 500 కూడా పలుకుతుంది. థియేటర్స్ లో వాళ్ళిచ్చే ఫెసిలిటీస్ కి 100 కూడా ఎక్కువే. అందుకే, ప్రజల జేబులు చిల్లు పడకుండా జగన్ సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఈ విషయంలో లోలోపల రగిలిపోతున్న పైకి మాత్రం శాంతంగా మాట్లాడుతున్నారు.
Also Read: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న పోలీస్!
ప్రత్యేక హోదా , మూడు రాజధానులు.. అమిత్ షా ముందు జగన్ డిమాండ్.. అజెండా ఇదీ