
కేంద్రంలో తాజా పరిణామాలను బట్టి చూస్తే.. వైఎస్ జగన్ కు బీజెపి అధిష్టానం అదిరిపోయే అఫర్ ఇచ్చిన్నట్టు తెలుస్తోంది. ఆ ఆఫర్ కు జగన్ అంగీకరిస్తారా? లేక తిరస్కారిస్తారా? ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రుల నుండి సాధారణ కార్యకర్తల వరకు ఇదే చర్చ ఆ పార్టీలో సాగుతోందట.. ఏన్డీఏలో చేరితే 3 మంత్రి పదవులు ఓసీ, బీసి, ఎస్సీలకు జగన్ ఇస్తారనేది పార్టీ నాయకుల అంచనా. ఓసీ వర్గం నుండి పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావటం ఖాయమని చెబుతున్నారు. బీసిల నుండి సీఎం జగన్ ఎవరీకీ మంత్రి పదవి ఇస్తారని ఆసక్తిగా మారింది. ఎస్సీలలో ఎవరికి కేంద్ర మంత్రిపదవి ఇస్తారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆఫర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ..
Also Read: జగన్, మోడీ భేటి: టార్గెట్ టీడీపీయేనా?
కేంద్రంలో.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి మిత్రులు దూరం అయిపోతున్నారు. అదే సమయంలో వైసీపీకి బీజేపీ దగ్గర అవుతోంది. ఇటీవల కాలంలో కేంద్రంలో నంబర్ 1, 2లుగా ఉన్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు వరుసగా ఏపీ సీఎం జగన్ తో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజెపీ పెద్దలతో వైఎస్ జగన్ మధ్య బంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయా? అంటే ఔననే అంటున్నాయి వర్గాలు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా తన కుటమిలో చేర్చుకోవాలని కమలదళం చూస్తోందట.. ఒకవైపు జాతీయ స్ధాయిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బలం తగ్గుతుండటం.. ఇంకోవైపు సుదీర్ఘకాలం మిత్రుడుగావున్నా అకాలిదళ్ వంటి పార్టీలు ఎన్డీఏ నుండి బయటికి వెళ్లిపోయిన తరుణంలో సౌత్ ఇండియా నుండి స్ట్రాంగ్ ప్రెండ్లీ పార్టీ కావాలని ప్రధాని మోడి , కేంద్రమంత్రి అమిత్ షాలు భావిస్తున్నారట.
భవిష్యత్ తరాలు రాబోయే ఎలక్షన్ లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడి, కేంద్రమంత్రి అమిత్ షాలు ప్రెండ్లీ పార్టీగా జగనే కావాలని కోరుకుంటున్నారట. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన వైఎస్ జగన్మోహన్ , ప్రధాని మోడి , అమిత్ షా ల మీటింగ్ లోనే ఈ ప్రెండ్ షిప్ కి అంకురార్పణ జరిగింది. వాస్తవానికి 2019 ‘సంవత్సరంలో అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీ తో గెలుపొందాయి. ఆ సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తమ ప్రభుత్వంలో చేరమని బీజేపీ కోరింది. అయితే జగన్ మాత్రం తాము బీజేపీ ప్రభుత్వంలో చేరమని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూ మద్దతు ఇస్తామని తెలిపింది .
మళ్ళీ 15 నెలల తర్వాత అదే బీజెపి ప్రభుత్వం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒత్తిడి మొదలయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి లోక్ సభ, రాజ్యసభలో 28 మంది ఎంపీలు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద 4వ పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అవిర్బవించింది. దీంతో ఇలాంటి పార్టీని తమ ప్రభుత్వంలో బాగస్వామ్యం చేసుకోవాలని ప్రధాని మోడి భావిస్తున్నారు. అందుకే కేంద్రమంత్రి అమిత్ షాకు అ బాధ్యతలను అప్పగించారట. వైఎస్ జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు ముందు రోజు సాయంత్రం భేటి కావడమే కాకుండా మళ్లీ మరుసటి రోజు ఉదయమే అమిత్ షా భేటి అయ్యారు. సుమారు 2 గంటలపాటు చర్చలో పాల్గొన్నారు.
ఇందుకు కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీఏలో చేరమని ఆహ్వనించటమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేబుతున్నారు. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో కంటే మంచి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఎన్డీఎ ప్రభుత్వంలో చేరితే 3 కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని.. అమిత్ షా జగన్ కు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో రెండు మంత్రి పదవులు ఇస్తానని చెప్పారు. ఇంతకుముందు టీడిపికి కూడా 2 మంత్రిపదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 3 కేంద్రమంత్రి పదవులు ఇస్తామని చెబుతున్నారట..
Also Read: కేంద్రంపై కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్.. ఎందుకు?
దక్షిణ భారతదేశంలో బీజెపి తో పోత్తు వున్న పార్టీలు ఏమి లేవు. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, ఒరిస్సా, కేరళ ,తమిళనాడు రాష్ట్రాలలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా బీజెపి పార్టీతో పోత్తులేదు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తమ మిత్రుడుగా మార్చుకోవాలని బీజెపి ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తిగా రాష్ట్రానికి చెందిన విభజన సమస్యలు, పోలవరం నిధులు , రాష్ట్రానికి రావల్సిన జీఎస్టీ బకాయిల సమస్యల మీదనే వచ్చినందున అ ఆఫర్ పై ఎలాంటి సమాధానం చెప్పలేదట. మా రాష్టానికి పూర్తిగా సహకరించండి. కేంద్రానికి ఎప్పుడు మా పార్టీ సపోర్ట్ ఉంటుందని అమిత్ షాకు చెప్పారట.
అంతకు ముందే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయాన్ని అమిత్ షాకు గుర్తుచేసారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కేంద్రంలో చేరే అంశం పైన తమ అభిప్రాయాన్ని తామ పార్టీ నాయకుల అందరితోనూ చర్చించి చెబుతానని తెలిపారు. అమిత్ షాతో భేటి ముగించుకొని రాష్టానికి వచ్చారు సీఎం జగన్. ఇప్పుడు వై ఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ విస్తృతంగా సాగుతోంది.
Comments are closed.