సమర్థవంతంగా పనిచేయని మంత్రులపై వేటు?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావడంతో మన పాలన – మీ సలహా పేరుతో ప్రజల నుంచి సలహాలు స్వీకరించారు. తాజాగా జగన్ తన మంత్రి వర్గం దృష్టి పెట్టారు. మంత్రి వర్గంలో మంత్రులు పనితీరుపై రూపొందించిన నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరును విశ్లేషించే పనిలో పడ్డారు. మంత్రి వర్గంలో ఎక్కువ మంది పనితీరు సీఎం జగన్ ఆశించిన స్థాయిలో లేదని నివేదికల ఆధారంగా స్పష్టం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏడాది కాలంలో […]

Written By: Neelambaram, Updated On : June 27, 2020 8:23 pm
Follow us on


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావడంతో మన పాలన – మీ సలహా పేరుతో ప్రజల నుంచి సలహాలు స్వీకరించారు. తాజాగా జగన్ తన మంత్రి వర్గం దృష్టి పెట్టారు. మంత్రి వర్గంలో మంత్రులు పనితీరుపై రూపొందించిన నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరును విశ్లేషించే పనిలో పడ్డారు. మంత్రి వర్గంలో ఎక్కువ మంది పనితీరు సీఎం జగన్ ఆశించిన స్థాయిలో లేదని నివేదికల ఆధారంగా స్పష్టం అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చురగొంది. మరికొన్ని నిర్ణయాలను తీసుకోవడం ప్రజల మెప్పు పొందింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం మరికొన్ని సాహసోపేత నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం తీసుకోవటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అనేక అంశాలపై ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఎదుర్కోవడంలో వైసీపీ మంత్రులు విఫలమయ్యారని వాదనలు ఉన్నాయి.

పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?

అయితే మంత్రులు ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఎదుర్కోవడం, వారి శాఖలపై సాధించిన పట్టు, వారి జిల్లాలో సమర్ధవంతంగా పనిచేయడం ఆధారంగా వీరి పనితీరు అంచనా వేశారు. సీఎం జగన్ వద్ద ఉన్న నివేధిక ఆధారంగా మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. సరైన పనితీరు లేనివారిలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఉన్నట్లు సమాచారం.

మరోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎన్నిక అవడంతో వారి స్థానాలు ఖాళీ అవనున్నాయి. మరో రెండు రోజుల్లో వీరు తమ రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమించే క్రమంలో పనితీరు సక్రమంగా లేనివారిపైన వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. తొలుత రెండున్నర ఏళ్లకు మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. అయితే అనుకోకుండా మంత్రి వర్గంలోకి కొత్తవారికి తీసుకోవాల్సి వచ్చింది.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?

మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది. ఎవరిపై చర్యలు ఉంటాయనే విషయం ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో ఉప ముఖ్య మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ పేరు వినిపిస్తోంది. రాజ్యసభకు ఎన్నికైన మంత్రులు ఇద్దరూ రాజీనామా చేసిన అనంతరం కొత్తవారి పేర్లు ఖరారు చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పనితీరు సరిగా లేనివారిపైన చర్యలు ఉండనున్నాయనేది ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే నెలలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది.