ఏదేని బలప్రయోగంలో ఇద్దరు సమ ఉజ్జీలై ఉంటేనే ఆ మ్యాచ్ మజా వస్తుంది. రాజకీయాల్లోనూ.. అధికార పక్షానికి దీటుగా ప్రతిపక్షం ఉండాల్సిందే. ఏపీలో ప్రస్తుతం జగన్‌కు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మాత్రమే. అయితే.. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎలా అయితే వైసీపీని బలహీనపర్చాలని చూసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీ మీద అదే ఆలోచనతో ఉంది. ఈ ఆలోచన జగన్‌కే మైనస్ అవుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Also Read: ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి తెలుసుకుందాం
మరోవైపు బీజేపీ, జనసేన బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, జనసేన బలోపేతమై తెలుగుదేశం పార్టీ బలహీన పడితే అది జగన్‌కు ఇబ్బందేనట. దుబ్బాక ఉప ఎన్నికను తీసుకుంటే ఏపీలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్‌ను వీక్ చేసేశారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. బీజేపీ పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరించారు. అదే దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీకి దెబ్బకొట్టింది.
ఎలాగూ రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ కావడం.. బలపడే పరిస్థితులు లేకపోవడంతో ఆ ఓటు బ్యాంకు కాస్త బీజేపీ వైపు మళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పోయింది. చివరకు ఈ ఫలితాన్ని కేసీఆర్ అనుభవించాల్సి వచ్చింది. అలాగే ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ బలహీనపడే కొద్దీ ఆ ఓటు బ్యాంకు బీజేపీ, జనసేన వైపు మొగ్గు చూపే అవకాశముంది. అది రానున్న ఎన్నికల్లో జగన్ కు తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందంటున్నారు విశ్లేషకులు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. రూ.75,000 వేతనంతో ఉద్యోగాలు..?
ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పటికీ ఓటు బ్యాంకు ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. బీసీలతోపాటు మేధావులు, తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతారు. చంద్రబాబు నాయకత్వం పట్ల ఈ వర్గాలు సానుకూలంగా ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు బలహీనపడ్డారో ఈ వర్గమంతా బీజేపీ వైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే జగన్ తెలుగుదేశం పార్టీని బలహీన పర్చే ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మేలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్