https://oktelugu.com/

Chandrababu To Jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ? 

Chandrababu to jail: 40 ఇయర్స్ పాలిటిక్స్ మరీ.. సొంత మామనే అధికారంలోంచి దించేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి.. రాష్ట్రానికి సీఎం అయ్యి.. నందమూరి ఫ్యామిలీ మద్దతును పొంది చక్రం తిప్పిన మహా రాజకీయ మేధావి మన చంద్రబాబు. ఆయన పలికే భాష సరిగ్గా ఉండదేమో కానీ.. ఆయన ఐడియాలజీకి మాత్రం ప్రత్యర్థులు గజగజ వణికిపోవాల్సిందే.. మేనేజ్ మెంట్ లో చంద్రబాబు కింగ్ అని చెప్పుకుంటారు. మీడియాను, వ్యవస్థలను బాగా మేనేజ్ చేయగలరని పేరు పొందారు. అందుకే […]

Written By:
  • NARESH
  • , Updated On : May 11, 2022 / 10:10 AM IST
    Follow us on

    Chandrababu to jail: 40 ఇయర్స్ పాలిటిక్స్ మరీ.. సొంత మామనే అధికారంలోంచి దించేసి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి.. రాష్ట్రానికి సీఎం అయ్యి.. నందమూరి ఫ్యామిలీ మద్దతును పొంది చక్రం తిప్పిన మహా రాజకీయ మేధావి మన చంద్రబాబు. ఆయన పలికే భాష సరిగ్గా ఉండదేమో కానీ.. ఆయన ఐడియాలజీకి మాత్రం ప్రత్యర్థులు గజగజ వణికిపోవాల్సిందే.. మేనేజ్ మెంట్ లో చంద్రబాబు కింగ్ అని చెప్పుకుంటారు. మీడియాను, వ్యవస్థలను బాగా మేనేజ్ చేయగలరని పేరు పొందారు. అందుకే ఇప్పటిదాకా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కేసులు ఆయనపై నమోదైనా ఒక్కటంటే ఒక్క కేసు కూడా నిలబడలేదంటే అతిశయోక్తి కాదు. కేసుల్లో దొరక్కుండా.. కోర్టుల్లో చిక్కకుండా.. చిక్కినా బయటపడేలా ఆయన మేనేజ్ మెంట్ అద్భుతంగా ఉంటుందంటూ ఆయనను దగ్గరి నుంచి చూసిన కొందరు రాజకీయ మేధావులు చెబుతుంటారు. చంద్రబాబును లోపలేయడం (జైల్లో వేయడం) అంత ఈజీ కాదన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట..చంద్రబాబు జైలుకు పంపడం సాధ్యమా? జగన్ పంతం నెరవేరుతుందా? అడ్డంకులేమిటన్న దానిపై స్పెషల్ ఫోకస్.

    Chandrababu, JAGAN

    -ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో కేసులు
    చంద్రబాబు రాజకీయ జీవితమే ‘వెన్నుపోటు’ నుంచి మొదలైంది. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఇప్పటికీ బాబు రాజకీయ జీవితంలో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోయింది. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఆయనపై ఎన్నో విమర్శలు, దాడులు, కేసులు నమోదైనా.. ఒక్కటంటే ఒక్క దాంట్లోనూ ఆయన చిక్కలేదు. రెండు ఎకరాల నుంచి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హరిటేజ్ వంటి కార్పొరేట్ సూపర్ మార్కెట్ల వరకూ ఎదిగినా.. హరిటేజ్ పాలు, పెరుగు పదార్థాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ పారిశ్రామికవేత్తగా నిలిచినా ఆయనపై ఒక్కటంటే ఒక్క అవినీతి కేసు కూడా నిలబడలేదు. ఆది నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి లూప్ హోల్స్ ఏవీ దొరకకుండా అత్యంత పకడ్బందీగా సాగుతారని ఒక టాక్ ఉంది. ఏదైనా ప్రాజెక్ట్ కానీ.. ఏదైనా ప్రభుత్వం కానీ అందులో ఎక్కడా దొరకకుండా వ్యవహరిస్తారని… న్యాయస్థానాల్లోనూ క్లీన్ చిట్ వచ్చేలా ప్రభుత్వ వ్యవహారాలను తీర్చిదిద్దుతారని టాక్ ఉంది. అందుకే చంద్రబాబు హయాంలోని ఏ అధికారి కూడా అవినీతి కేసుల్లో చిక్కిన దాఖలాలు లేవు. అదే వైఎస్ హయాంలో ఇష్టానుసారం చేసేసిన ఐఏఎస్ లు ఇప్పుడు జైలు పాలవుతున్నారు.

    Also Read: Asani Cyclone Impact: అసని తుఫాన్ ఎఫెక్ట్: ఏ దేశం నుంచో సముద్రంలో కొట్టుకు వచ్చిన బంగరు రథం.. వైరల్

    -చంద్రబాబుకు, జగన్ కు అదే తేడా?
    ప్రభుత్వంలో, ప్రతిపక్షంలో ఎవరిని ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు అంటారు. అవసరమైతే జుట్టు పట్టుకోవడం.. లేదంటే ఏది అయినా సరే పట్టుకోవడానికి చంద్రబాబు వెనుకాడరని రాజకీయవర్గాల్లో పేరుంది. నాడు 2014లో అధికారం కోసం అప్పుడే పుట్టిన జనసేన పార్టీని కూడా ఆయన కలుపుకుపోయాడు. ప్రోటోకాల్ సీనియారిటీని మరిచి పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి మరీ ఆయనను పొత్తు కోసం ఆహ్వానించారు. ఇలా జగన్ అస్సలు చేయరు. ఎందుకంటే ఆయన ఇగో అడ్డు వస్తుంది. చంద్రబాబుకు ఇలాంటివి ఏవీ ఉండవు. అందుకే రాజకీయంగా ఎత్తులు వేయడంలో చంద్రబాబు తోపుగా ఉంటారు. ఇప్పుడు పొత్తులతో జగన్ ను చిత్తు చేయడానికి రెడీ అయ్యారు.

    Chandrababu, JAGAN

     

    -మేనేజ్ మెంట్ లో కింగ్ చంద్రబాబు
    ఓ వైపు మీడియాను పెట్టుకొని మరో వైపు కోర్టుల్లో బలంగా వాదిస్తూ కేసులను నిలవకుండా చేయడంలో చంద్రబాబును అందెవేసిన చేయి ఎప్పుడో నిరూపితమైంది. చంద్రబాబుపై ఒక్క కేసు కూడా కోర్టుల్లో నిలవలేదంటే అతిశయోక్తి కాదు. అంత దాకా ఎందుకు 2014లో ఏపీ సీఎంగా తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి ‘ఓటుకు నోటు’ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తర్వాత చంద్రబాబుపై కేసు నమోదై ఖచ్చితంగా జైలుకు వెళతాడని అనుకున్నారు. కానీ తనను అంత అభాసుపాలు చేసిన కేసీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు ఆయనతో ఏం రాజీ కుదుర్చుకున్నారో కానీ ఆ కేసులో అస్సలు బాబు ప్రమేయమే లేకుండా పోయింది. కేవలం రేవంత్ రెడ్డి మెడకు కేసు బిగుసుకుంది. ఇక చంద్రబాబు ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో కూడా లంచం డబ్బుల గురించి ఎంతో పకడ్బందీగా మాట్లాడారు. ‘అంతా నే చూసుకుంటాను.. బ్రీఫిడ్ మి’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఎక్కడ దొరక్కుండా వ్యవహరించారు.ముఖ్యంగా కోర్టుల్లోనూ ఇలాంటి సాక్ష్యాలు చెల్లుబాటు కాకుండా బాబు మాటలు ఉన్నాయి.

    Also Read: Gadapa Gadapaku YCP: గడపగడపకు వెళ్లలేం.. అధికార వైసీపీ నాయకుల్లో వణుకు..

    ఇలా ఎన్ని కేసుల నమోదైనా కూడా చంద్రబాబును జైల్లో పెట్టడం జగన్ కు తాహతకు సరిపోవడం లేదు. ఇక రాజధాని భూముల్లో అవినీతిపై ఇదివరకే ఒకసారి చంద్రబాబుపై కేసు పెట్టగా హైకోర్టులో వీగిపోయింది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు. సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని.. అందుకే చంద్రబాబు సహా పలువురిపై కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. అయితే ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి విషయంలో అభియోగాలు మోపి నిరూపించలేకపోయారని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం నాయకులు ధీమాగా ఉన్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబును జైలుకు పంపడం అసాధ్యమని తెలిసి జగన్ మాస్టర్ ప్లాన్ వేశాడు. కొన్ని రోజులైనా బాబును జైల్లో పెట్టాలని స్కెచ్ గీశాడు. అందుకే హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైలుకు పంపించే ఎత్తుగడ వేశారు. చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. కానీ కోర్టుల్లో అత్యవసర పిటీషన్లు వేసి మరీ బయటకొచ్చే సత్తా బాబుకు ఉంది. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

    Also Read:Chandrababu to jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ? 

    Recommended Videos: