Homeఆంధ్రప్రదేశ్‌Dadi Veerabhadra Rao: జనసేనలోకి దాడి వీరభద్రరావు?

Dadi Veerabhadra Rao: జనసేనలోకి దాడి వీరభద్రరావు?

Dadi Veerabhadra Rao: ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి దూరమయ్యారా? లేకుంటే నాయకత్వమే ఆయనకు దూరం పెట్టిందా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈ హిందీ మాస్టర్ సుదీర్ఘకాలం అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు.మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా దాడి వీరభద్ర రావు కు మాత్రం చంద్రబాబు అరుదైన గౌరవం ఇస్తూ వచ్చారు. కానీ శాసనమండలి పదవి ఇవ్వలేదన్న సాకు చూపి ఆయన వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్నారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా.. హిందీ భాష పండితుడిగా వీరభద్రరావుకు పేరు ఉంది. టిడిపి అధికార ప్రతినిధిగా ప్రత్యర్థులపై విమర్శలు ఓ రేంజ్ లో సంధించేవారు. అయితే ఆది నుంచి దాడి వీరభద్ర రావు ది విలక్షణ శైలే. టిడిపి సంక్షేప సమయంలో ఎన్టీఆర్కు అండగా నిలబడిన 30 మంది ఎమ్మెల్యేల్లో దాడి వీరభద్రరావు ఒకరు. అప్పట్లో చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినా వెళ్లలేదని టాక్ నడిచింది. అయితే అక్కడికే కొన్నాళ్లకు దాడి వీరభద్రరావు చంద్రబాబు గూటికి చేరారు. 2010 వరకు ఆ పార్టీలోనే పనిచేశారు.

2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ దాడి వీరభద్రరావు సీనియారిటీ కి తగ్గట్టు పార్టీలో గౌరవం దక్కలేదు. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన జగన్.. దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ కు విశాఖ నగరంలోని పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. కానీ రత్నాకర్ ఓడిపోయారు. అప్పటినుంచి తండ్రీ కొడుకులకు పెద్దగా గౌరవం లభించడం లేదు. అందుకే వ్యూహాత్మకంగా దాడి వీరభద్రరావు మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. అయితే సీఎం జగన్ వైఖరి ఆయనకు నచ్చడం లేదు. అలాగని మాతృ పార్టీ టిడిపికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఆయన జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దాడి వీరభద్రరావు సీనియర్ నాయకుడు కావడంతో పవన్ కు ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. గతంలో ఓసారి నేరుగా దాడి వీరభద్ర రావునే పవన్ కళ్యాణ్ కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. అప్పటి నుంచే దాడి వీరభద్రరావు జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో ఆయన కుమారుడితో పాటు పవన్ గూటికి చేరతారని తెలుస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version