కరోనా తగ్గేనా?

కరోనా కట్టడికి వ్యాక్సనేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకుని కరోనా రక్కసిని రూపుమాపాలని పదేపదే సూచిస్తున్నా దాని పనితనంపై సైతం పలు అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుందని తేలడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో 30 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. మన దేశంలో కేవలం 2.5 శాతం మందికే కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ సమర్థతపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా.. కరోనా వ్యాక్సిన్ […]

Written By: NARESH, Updated On : May 11, 2021 3:47 pm
Follow us on

కరోనా కట్టడికి వ్యాక్సనేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకుని కరోనా రక్కసిని రూపుమాపాలని పదేపదే సూచిస్తున్నా దాని పనితనంపై సైతం పలు అనుమానాలున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకుతుందని తేలడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో 30 శాతం మందికి వ్యాక్సిన్ వేశారు. మన దేశంలో కేవలం 2.5 శాతం మందికే కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ సమర్థతపై కూడా సందేహాలు కలుగుతున్నాయి.

వ్యాక్సిన్ వేసుకున్నా..
కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ ప్రవేశానికి అడ్డు కాదని తేలింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా వ్యాధి సోకుతుందని చెబుతున్నారు. కాకపోతే లక్షణాలు కనిపించవని తెలుస్తోంది. దీంతో వైరస్ నిరోధానికి సరైన చర్యలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కనీసం సగం మందికైనా టీకా వేయాలనే ఆశయం ఉన్నా అది నెరవేరడం లేదు. వ్యాక్సిన్ మనుగడపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా రోగ నిరోధక శక్తి పెరగదనే విషయం స్పష్టం అవుతోంది.

ఇండియాలో సక్సెస్ రేట 80 శాతమే
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ సక్సెస్ రేటు 80 శాతమే. అమెరికాలో మాత్రం 90 శాతమట. మనదేశంతో పోలిస్తే ఇతర దేశాల్లోనే ఎక్కువగా సక్సెస్ రేటు ఉండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు . కరోనా వైరస్ ధాటికి సామాన్య జనం తలకిందులవుతున్నారు. సెకండ్ వేవ్ తో అన్ని ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చడంతో బెంబేలెత్తిపోతున్నారు. కరోనా నిరోధంపై ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు.

ఇంకెంత సమయం పడుతుందో?
కరోనా వైరస్ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా దాని ఉధృతి ఆగడం లేదు. ఫలితంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ మాత్రం ఆగడం లేదు. దీంతో ఎంతో మంది బలవుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు మూడు కోట్ల నలభై లక్షల మంది మాత్రమే టీకా వేసుకున్నారు. కనీసం 30 శాతం మందైనా టీకా వేసుకుంటే దాని నిరోధానికి చర్యలు తీసుకున్నట్లు అవుతుంది. అంటే కరోనా వ్యాక్సిన్ డోసులు పెంచి రక్కసినిరూపు మాపాలని ప్రజలు బావిస్తున్నారు.