షాకింగ్ : గుండెపోటుతో స్టార్ రైటర్ మృతి !

సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ఓ గొప్ప రచయిత జోసెఫ్ ఇక లేరు. ఆయన మలయాళ ఇండస్ట్రీలో టాప్ రైటర్. అయితే ఆయన రాసిన ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తెలుగులో అలాగే తమిళంలో కూడా రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి. రచయితకు భాషతో సంబంధం లేదు, భావంతోనే బంధం. ఆ బంధంతో అన్ని బాషల వారికీ సంబంధం ఉంటుందని నిరూపించిన వాళ్లల్లో జోసెఫ్ […]

Written By: NARESH, Updated On : May 11, 2021 3:54 pm
Follow us on

సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ఓ గొప్ప రచయిత జోసెఫ్ ఇక లేరు. ఆయన మలయాళ ఇండస్ట్రీలో టాప్ రైటర్. అయితే ఆయన రాసిన ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తెలుగులో అలాగే తమిళంలో కూడా రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి. రచయితకు భాషతో సంబంధం లేదు, భావంతోనే బంధం.

ఆ బంధంతో అన్ని బాషల వారికీ సంబంధం ఉంటుందని నిరూపించిన వాళ్లల్లో జోసెఫ్ ఒకరు. ఆయన పూర్తి పేరు ‘డెన్నిస్ జోసెఫ్’. కాగా గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధించిన ఆనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడవటం రచయితలందరికీ తీరని లోటు.

జోసెఫ్ 1985లో ఈరన్ సంధ్య సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జోసెఫ్‌ ఎక్కువుగా మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి స్టార్‌ హీరోలతోనే పని చేయడం, అలాగే మలయాళ సినీ చరిత్రలో మిగిలిన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలకు ఆయన రచయిత కావడం, జోసెఫ్ సాధించిన మరో ఘనత. పైగా జోసెఫ్ అందించిన కథలతో ఇతర ఇండస్ట్రీ వారు కూడా అనేక రికార్డులు కైవసం చేసుకున్నారు.

ఇక ‘మను అంకుల్ ‘ అనే సినిమాతో బెస్ట్‌ స్క్రిప్ట్‌ రైటర్‌ గా కూడా జోసెఫ్ నేషనల్‌ అవార్డును సాధించిండం మరో రికార్డు. జోసెఫ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు నలభై ఐదు సినిమాలకు కథలందించారు. అదే విధంగా ఐదు సినిమాలకు దర్శకత్వం కూడా వహించి, హిట్ డైరెక్టర్ కూడా ఆయన ఘనత సాధించారు. . జోసెఫ్‌ మృతితో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున జోసెఫ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.