Etala Mark: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కావాల్సిన సంఖ్యా బలం టీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగీవ్రమై సత్తాచాటారు. దీంతో టీఆర్ఎస్ కు ఎలాగైనా షాకివ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోయిన రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏకగ్రీవం కాగా మిలిగిన స్థానాల్లో స్వత్రంత్య, రెబల్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉండగా ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్ స్థానాల్లో ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లొండలో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ స్వతంత్ర్య అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డికే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆదిలాబాద్ లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పుష్పారాణికి కాంగ్రెస్ అధికారికంగానే మద్దతు ఇస్తోంది.
కరీంనగర్ విషయానికొస్తే.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హుజూరాబాద్లో గెలిచి సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటల రాజేందర్ కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు షాకివ్వాలని భావిస్తున్నారు.
Also Read: సై.. పార్లమెంట్ సాక్షిగా బీజేపీపై తొడగొట్టిన టీఆర్ఎస్.. ఇరికించేలా కొత్త విధానం
దీనిలో భాగంగానే కరీంనగర్ నుంచి బరిలో ఉన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ కు ఆయన మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ నేతల మద్దతు కోరుతున్నారు. ఈటల మద్దతు రవీందర్ సింగ్ కు ఉండటంతో కాంగ్రెస్ సైతం ఆయనకు మద్దతు ఇవ్వాలని భావిస్తుందట.
తాము గెలువలేని చోట టీఆర్ఎస్ ను ఓడించాలనే కసితో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ఈటలకు కాంగ్రెస్ అభయహస్తం అందిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అన్ని జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉండగా ఏ ఒక్కచోట ఓడినా అక్కడ ఆపార్టీ బలహీనంగా ఉన్నాయనే సంకేతాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీంతో దీనిని ఫోకస్ చేసేలా కాంగ్రెస్ పార్టీ ఈటల మార్క్ రాజకీయానికి తెరలేపుతుండటం ఆసక్తిని రేపుతోంది.
Also Read: కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్