Rashmika Mandanna: ఈ రోజుల్లో ఒక హీరోకి వరుసగా రెండు ప్లాప్స్ వస్తే.. ఇక ఆ హీరో జీరోనే. అలాంటిది హీరో శర్వానంద్ కి ప్లాప్ లు తప్ప ఈ మధ్య కాలంలో హిట్లు లేవు. మరి శర్వా పరిస్థితి ఏమిటి ? తన రేంజ్ ను పెంచుకోవాలని రకరకాల ప్రయోగాలు చేసి, చివరకు ఉన్న రేంజ్ ను కూడా పోగొట్టుకునే స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు శర్వానంద్. నిజానికి శర్వా మంచి కథల్నే సినిమాలుగా చేస్తూ వస్తున్నాడు.

కానీ ఎందుకో కథల్లో మ్యాటర్ ఉన్నా.. కమర్షియల్ గా శర్వా సినిమాలు ఏవీ వర్క్ అవుట్ కావడం లేదు. ఇంకా చెప్పాలంటే అన్నీ సినిమాలకు నష్టాలే మిగులుతున్నాయి. కారణం, ఎంచుకున్న టీమ్ కూడా కావొచ్చు. అయినా వరుసగా అపజయాలే వివరిస్తున్నప్పుడు.. కాస్త ఆచితూచి అడుగు వేయడం అనేది కనీస బాధ్యత. కానీ శర్వా మాత్రం ఆ విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడు.
అసలు 2017లో విడుదలైన ‘మహానుభావుడు’ తర్వాత శర్వానంద్ కి మరో హిట్ లేదు. ఆ మాటకొస్తే.. ‘మహానుభావుడు’ కూడా హిట్ సినిమా ఏమి కాదు. జస్ట్ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయింది. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ ఇలా ప్రతి సినిమా నిర్మాతలకు కన్నీళ్లనే మిగిల్చింది.
ఇలా తన ఫ్లాపుల పరంపరలో శర్వా తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోయాడు. ఇలాంటి పొజిషన్ లో శర్వా పై అదనపు బడ్జెట్ పెడుతూ చేస్తోన్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే.. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు అందించిన హీరోగా శర్వా కొత్త రికార్డు క్రియేట్ చేసినవాడు అవుతాడు.
Also Read: శర్వానంద్ ఆశలన్నీ ఆ సినిమాపైనే.. అందుకే ఓటీటీ ఎంచుకున్నారా?
అయితే, ఈ సినిమా హిట్ అవుతుంది అని, తనకు మళ్ళీ మార్కెట్ క్రియేట్ అవుతుందని శర్వానంద్ బలంగా నమ్ముతున్నాడు. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. జనం బాగా ఆసక్తి చూపిస్తారు. పైగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ టు ప్లేస్ లో ఉంది.
కాబట్టి.. రష్మిక క్రేజ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది. ఇదే విషయాన్ని శర్వా టీమ్ బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్స్ కు చెబుతున్నారు. అన్నిటికీ మించి ఈ సినిమాకి దర్శకుడు కిషోర్ తిరుమల. దర్శకుడిగా కిషోర్ తిరుమల ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. యావరేజ్, ఎబో యావరేజ్ సినిమాలే తీశాడు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమాతో శర్వాకి హిట్ రావడం ఖాయం అంటున్నారు శర్వా టీమ్. మరి చూడాలి ఏమి జరుగుతుందో.
Also Read: వారం గ్యాప్ లోనే రష్మిక నుంచి రెండు భారీ ప్రాజెక్టులు !