spot_img
Homeఆంధ్రప్రదేశ్‌బీజేపీ హిందుత్వంపై చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా...?

బీజేపీ హిందుత్వంపై చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా…?

Will BJP prove its sincerity on Hindutvam

ఎవరు ఏం అనుకున్నా బీజేపీ పార్టీ హిందుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీ అనే సంగతి బహిరంగంగా అందరికీ తెలుసు. ఏపీ విషయాల్లో కొంత సైలెంట్ గానే ఉండే బీజేపీ అంతర్వేది రథం ఘటన విషయంలో మాత్రం సీరియస్ గా వ్యవహరించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు.

Also Read: బిజెపి-జనసేన మూడో ప్రత్యామ్నాయం కావాలంటే?

ఇళ్లల్లో కూర్చుని నిరసన దీక్షలు చేపట్టి అధికార పార్టీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ నచ్చజెప్పటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే బీజేపీ నేతలు తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే చందాన విమర్శల పర్వం కొనసాగించారు. మరోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనల విషయంలో కుట్ర కోణం దాగుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

జగన్ సర్కార్ ను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో కొందరు కావాలనే ఈ తరహా కుట్ర కోణాలకు తెర లేపుతున్నారని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా జగన్ సర్కార్ అంతర్వేది ఘటన విచారణను సీబీఐకి అప్పగించింది. దీంతో బీజేపీకి జగన్ సర్కార్ పై అంతర్వేది ఘటన విషయంలో విమర్శలు చేసే హక్కు లేకుండా పోయింది. ఇక ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారో బీజేపీ నేతలే తేల్చాల్సి ఉంది.

Also Read: బీజేపీ బండి సంజయ్ ముందున్న సవాళ్లు ఇవే..

ఈ ఘటన విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. రాష్ట్ర పోలీసులపై కూడా ప్రత్యర్థి పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర విచార‌ణ సంస్థ‌కే అంతర్వేది కేసును జగన్ సర్కార్ అప్పగించడంతో హిందూ ద్రోహులను ఎన్ని రోజుల్లో సీబీఐ పట్టుకుంటుందో చుడాల్సి ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper