https://oktelugu.com/

బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ కన్నుమూత

ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా వెంటీలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారని ఐఎల్.బీఎస్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. Also Read: కాంగ్రెస్ ప్రక్షాళన.. రాహుల్ టీంకే సోనియా పట్టం! ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగిన స్వామి అగ్నివేశ్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2020 / 09:16 PM IST
    Follow us on

    ప్రముఖ సామాజిక కార్యకర్త, ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ (80) కన్నుమూశారు. కాలేయ సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన మంగళవారం ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా వెంటీలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారని ఐఎల్.బీఎస్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

    Also Read: కాంగ్రెస్ ప్రక్షాళన.. రాహుల్ టీంకే సోనియా పట్టం!

    ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగిన స్వామి అగ్నివేశ్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోనే స్వామి అగ్నివేశ్ 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. అయితే నాలుగేళ్లకే ఆయన తండ్రి మరణించడంతో తాత వద్ద పెరిగారు.

    అనంతరం పశ్చిమ బెంగాల్ కు వెళ్లి కోల్ కతాలోని సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్ లో పట్టా పొందారు.

    Also Read: మాఫియా డాన్ దావూద్ గ్యాంగ్ తో అక్షయ్ కు సంబంధాలు?

    చదువు ముగిసిన  అనంతరం దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించి 1977లో హర్యానాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.మంత్రిగా సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ ను స్థాపించారు. మావోయిస్టులతోనూ చర్చలు జరిపారు. ఆర్యసమాజ్ అంతర్జాతీయ మండలి అధ్యక్షుడిగా 2014 వరకు కొనసాగారు. దేశంలో ప్రజాందోళన కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందారు.