బీహార్ ఎన్నికలు గుణపాఠం కానున్నాయా..?

ఈసారి బీహార్‌‌ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలే వచ్చాయి. కనీసం సర్వేలు సైతం ఓటరు నాడిని పట్టుకోలేకపోయాయి. కూటమిగా ఏర్పడిన పార్టీలదే చివరకు విజయమని అన్ని సంస్థలూ తేల్చాయి. కూటమి పార్టీలు కూడా అదే జోష్‌లో ఉండిపోయాయి. కానీ.. అనూహ్యంగా ఎన్డీఏ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కూటమిలోని పార్టీలకు పెద్ద షాక్‌ తగిలింది. అయితే.. కూటమిగా ఏర్పడినప్పటికీ ప్రాంతీయ పార్టీలనూ ప్రజలు పెద్దగా లెక్క చేయలేదు. దీంతో ఆర్జేడీకి చివరికి ఓటమి తప్పలేదు. Also Read: బీజేపీ, జనసేనల […]

Written By: NARESH, Updated On : November 25, 2020 11:58 am
Follow us on

ఈసారి బీహార్‌‌ ఎన్నికల్లో ఊహకందని ఫలితాలే వచ్చాయి. కనీసం సర్వేలు సైతం ఓటరు నాడిని పట్టుకోలేకపోయాయి. కూటమిగా ఏర్పడిన పార్టీలదే చివరకు విజయమని అన్ని సంస్థలూ తేల్చాయి. కూటమి పార్టీలు కూడా అదే జోష్‌లో ఉండిపోయాయి. కానీ.. అనూహ్యంగా ఎన్డీఏ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కూటమిలోని పార్టీలకు పెద్ద షాక్‌ తగిలింది. అయితే.. కూటమిగా ఏర్పడినప్పటికీ ప్రాంతీయ పార్టీలనూ ప్రజలు పెద్దగా లెక్క చేయలేదు. దీంతో ఆర్జేడీకి చివరికి ఓటమి తప్పలేదు.

Also Read: బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడవదా?

బీహార్ ఎన్నికల ఫలితాలు అన్ని రాజకీయ పార్టీలకు పాఠాన్ని నేర్పాయనే చెప్పాలి. కూటమిలో పార్టీలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీహార్ ఎన్నికలు తేల్చిచెప్పాయి. అక్కడ లోక్ జనశక్తి పార్టీ విడిగా పోటీ చేయడం, మాంఝీ పార్టీ ఎన్నికలకు ముందు మహాకూటమి నుంచి ఎన్డీఏ కూటమిలో చేరడం వంటివి ఆసక్తికరంగా మారాయి. చిన్న పార్టీలను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని బీహార్ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి. దీంతో తమిళనాడులోనూ చిన్న పార్టీలకు క్రేజ్ ఏర్పడింది.

బీహార్ ఎన్నికల్లో దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద లోపు మెజార్టీతోనే ఆర్జేడీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోయింది. తమిళనాడులోనూ బీహార్ తరహాలోనే ప్రాంతీయ పార్టీలదే హవా ఎక్కువ. ఇక్కడ లెక్కకు మించిన చిన్న పార్టీలున్నాయి. వాటిని గతంలో శాసించే పార్టీలు ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నాయి. వారి డిమాండ్లు ఎక్కువగా ఉండటంతో ఇటు కాదనలేక, అటు ఔననలేక మధనపడుతున్నాయి.

Also Read: హైదరాబాద్ పై బీజేపీ దండయాత్ర!

డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ వంటి చిన్నచిన్న పార్టీలున్నాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేలు ఉన్నాయి. ఈ చిన్న పార్టీలన్నీ తమిళనాడులో ఏదో ఒక వర్గాన్ని ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇప్పుడు చిన్న పార్టీలన్నీ తమకు అధిక స్థానాలను కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితి ప్రతిపక్ష డీఎంకేలో ఎక్కువగా కనిపిస్తోంది. తమకు ఎక్కువ స్థానాలను కేటాయించకపోతే ప్రత్నామ్నాయం ఆలోచించుకోవాల్సి ఉంటుందని అల్టీమేటం జారీ చేయడం కలవరపరుస్తోంది. మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులోని చిన్న పార్టీలకు డిమాండ్ పెరిగినట్లే అర్థమవుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్