బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌‌ అతనేనా..?

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మెల్లమెల్లగా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు హౌస్‌లో ఉండగా.. అప్పుడే ఫైనల్‌ పోరుపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి. బిగ్ బాస్ 2లో కౌశల్ మందాకు లాగానే ఇతనిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్న గ్రూపులు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అప్పుడే ఫైనల్‌ […]

Written By: NARESH, Updated On : November 26, 2020 11:33 am
Follow us on

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 మెల్లమెల్లగా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు హౌస్‌లో ఉండగా.. అప్పుడే ఫైనల్‌ పోరుపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి. బిగ్ బాస్ 2లో కౌశల్ మందాకు లాగానే ఇతనిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్న గ్రూపులు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అప్పుడే ఫైనల్‌ విజేత అభిజిత్‌ అనే ప్రచారమూ నడుస్తోంది.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !

కానీ.. అభిజిత్ విన్‌ అయ్యేందుకు ఒక విషయం మాత్రం బలంగా అడ్డుపడుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు అందరిలోనూ అభిజిత్‌కు అదనపు అడ్వాంటేజ్‌లు ఉన్నాయనే విషయం ఎవరూ కాదనలేరు. అతని గుడ్ లుక్స్, రెండు-మూడు సినిమాలు(లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)లో పూర్తిస్థాయి హీరో పాత్ర పోషించి ఉండటం, అదీ హోస్ట్ నాగార్జున భార్య అమలకు కొడుకు పాత్రలో నటించటం, ఒకటో, రెండో వెబ్ సిరీస్‌లలో నటించి ఉండటం ఇవన్నీ ప్లస్ పాయింట్సే. 32 ఏళ్ల అభిజిత్‌కు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. అమ్మ రాజశేఖర్, గంగవ్వ, కరాటే కళ్యాణి మొదలైన సీనియర్ బ్యాచ్ తప్పించి, చివరికి మిగిలిన యూత్ బ్యాచ్‌లో ఇతనే పెద్దవాడుకావటంతో వాళ్లకంటే ఎక్కువ ఉండే అనుభవం, పరిణతి కూడా ఇతనికి ప్లస్ పాయింటేనని చెప్పుకోవాలి.

అయితే అతను తనకున్న అడ్వాంటేజ్‌లను చక్కగా వినియోగించుకోలేదని టాక్‌ నడుస్తోంది. మొత్తం సీజన్‌లో టాస్క్‌లలో ఎక్కడా చురుకుగా పాల్గొనలేదు. తనకు భుజానికి సర్జరీ జరిగిందనే కారణాన్ని చెబుతుంటాడు. అంతేకాదు.. తనకు కళ్లకు కూడా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది. ఒకానొక సమయంలో జరిగిన వాదనలో తాను బాగా ఎడ్యుకేటెడ్ అని చెప్పటం, ఇంగ్లిష్‌లో మాట్లాడొద్దని పదే పదే చెప్పినా, ఇంగ్లిష్‌లో మాట్లాడటం చేస్తుంటాడు. హోస్ట్ నాగార్జున అతను చేసిన ఇలాంటి పలు తప్పులను ఎత్తి చూపినప్పుడు అభిజిత్ సారీలు చెప్పటం మొదట పదివారాలలో దాదాపు ప్రతి వారంలోనూ జరిగింది. అసలు బిగ్ బాస్ హౌస్‌కు కప్ గెలవటంకోసం కాదని, కేవలం అనుభవంకోసమే వచ్చానని తానే స్వయంగా చెప్పాడు.

Also Read: అవినాష్ కు ఇమ్యూనిటీ.. అదిరిపోయిన బిగ్ బాస్ ట్విస్ట్..!

అయితే వీక్ డేస్‌లో కూర్చుని ఉండే అభిజిత్, వీకెండ్స్ శని, ఆది వారాలలో నాగార్జున వచ్చినప్పుడు మాత్రం హ్యాపీ ఫేస్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తుంటాడు. నాగార్జునే స్వయంగా దీనిపై అభికి పలుసార్లు చురకలు అంటించారు కూడా. ఇక ప్రస్తుతానికొస్తే రేటింగ్స్ పరంగా అభిజిత్ మిగిలిన అందరు కంటెస్టెంట్స్ కంటే ముందు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ రేటింగ్స్ ఎంతవరకు ఒరిజినల్ అనేది అందరికీ డౌటే. కౌశల్ మందా విషయంలో బిగ్ బాస్ రేటింగ్స్ నవ్వులపాలైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే పునరావృతమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. టాస్కులు ఏమాత్రం ఆడని కంటెస్టెంట్‌ను గెలిపిస్తే బిగ్ బాస్ కాన్సెప్టుకే పూర్తి విరుద్ధం కనుక ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే వాదనకూడా బలంగా వినిపిస్తోంది. మరి చివరగా.. బిగ్‌బాస్‌ మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుటుంది..? ఒకవేళ అభిజిత్‌ను విన్నర్‌‌ని చేస్తే తర్వాత పరిణామాలు ఏంటి..? షో మీద ప్రజల నమ్మకానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా..? అనే అంశాలనూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.