సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా వాళ్లు ముఖకవలికల్లో నటన చూపిస్తే రాజకీయ నేతలు చేతల్లో చూపిస్తారు. సినిమా వాళ్లు రాజకీయాలను శాసించిన సందర్భాలు లేకపోలేదు. ఎన్టీఆర్, జయలలిత రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అయితే అందరు రాజకీయాల్లో రాణించే వీలు పడదు. వారి ప్రతిష్ట ఆధారంగానే అది సాధ్యం అవుతుంది. జనసేన పార్టీలో నాగబాబు పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు. కానీ ఆయనకు పదవి మాత్రం ఊరిస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆయన వ్యూహమేమిటో అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత నాగబాబు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. దీంతో పవన్ కల్యాణ్ అన్న నాగబాబు కోసం నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ అక్కడ తన ఉనికి నిరూపించుకోలేక రెండో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో రాజకీయాలంటే తనకు కలిసి రావడం లేదనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. మనపెద్దవారు ఏం చెప్పారు.
ఎక్కడైతో పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లు ఓటమి పొందిన చోటే మళ్లీ ప్రయత్నాలుచేస్తే గెలుపు మాత్రం దరి చేరవచ్చు. ఈ సత్యాన్ని గ్రహించిన వారు అందరు కూడా విజయం సాధించినట్లు తెలుస్తోంది. కానీ నాగబాబు మాత్రం ఆ దిశగా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. నాగబాబు డైలమాలో పడడంతో జనసేన పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా తీసుకున్న ఆయన ప్రస్తుతం ఎందుకు దూరంగా ఉంటున్నారని అందరిలో వ్యక్తమయ్యే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండడంతో జనసేన పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాగబాబుపైనే ఉంది. అయితే నాగబాబు మాత్రం రాజకీయాలంటేనే తనకు కలిసి రావడం లేదనే ఉద్దేశంతో దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో తమ్ముడి పార్టీని కాపాడాలన్న ఆతృత లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి పార్టీని గాడిలో పెట్టాలంటే నాగబాబుపైనే బాధ్యత ఉందనే విషయం ఆయన గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.