MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియా కాల్ లో మాట్లాడుతూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియాలో ఎంపీ పూర్తిగా నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చెష్టలతో ఇబ్బందిపెట్టారు. అయితే నెట్టింట్లో వైరల్ అయిన ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అటు నేషనల్ మీడియాలో కూడా దీనిపై ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది. ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమవుతోంది. విపక్ష పార్టీల నాయకులు మాత్రం ఎంపీ మాధవ్ ను పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేత సజ్జల రామక్రిష్టారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పుచేశారని నిరూపితమైతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ మహిళా పక్షపాతి అని.. ఎట్టి పరిస్థితుల్లో క్షమించమన్నారు. అవి మార్ఫింగ్ వీడియో అని ఎంపీ చెబుతున్న తరుణంలో..విచారణలో మాత్రం ఎంపీ తప్పిదం ఉన్నట్టు తేలితే సీరియస్ యాక్షన్ ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు.

మాధవ్ పై నేర చరిత..
గోరంట్ల మాధవ్ కు నేర చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై 2012లో రేప్ కేసు నమోదై ఉంది. 2019లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో సైతం రేప్ కేసును పేర్కొన్నారు. 2019 ఎన్నికల అనంతరం దేశ వ్యాప్తంగా నేర చరితులైన ఎంపీల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సైతం మాధవ్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఇదే విషయంపై నేషనల్ మీడియా సైతం కథనాలను ప్రచురించింది. అదే సమయంలో ఏపీ శాసనసభలో సైతం వైసీపీ ఎంపీ నేర చరిత్ర గురించి విపక్ష నేత చంద్రబాబు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా ఎంపీ గోరంట్ల మాధవ్ రేప్ కేసు విషయమై ప్రస్తావించగా వైసీపీ సభ్యులు అప్పట్లో అడ్డుకున్నారు. తాజాగా ఎంపీ నగ్న వీడియో బయటకు రావడంతో పాత విషయాలన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి. నాటి ఆరోపణలను వైసీపీ సీరియస్ గా తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని టాక్ నడుస్తోంది.
Also Read: Janasena Chief Pawan Kalyan: ఫైరింగ్ మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్.. నాదేండ్లది అదే దారి?
అనూహ్యంగా రాజకీయాల్లోకి..
గోరంట్ల మాధవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పోలీస్ అధికారిగా పనిచేశారు. 1998లో ఎస్ఐగా పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించారు.కడప జిల్లాలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు రావడంతో అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడే ఉన్న సమయంలో ఆయనకు సీఐ గా ప్రమోషన్ లభించింది. కదిరి సీఐగా బాధ్యతలు అప్పగించారు. అచ్చం సినిమా పోలీస్ అధికారి మాదిరిగా పేరు తెచ్చుకునేందుకు తాపత్రయపడేవారని టాక్ ఉండేది. సెటిల్ మెంట్ ఆరోపణలు సైతం ఉన్నాయి. వ్యక్తిగత వివాదాల్లో సైతం తలదూర్చి షటిల్ చేస్తారన్న పేరు ఉంది. కదిరి సీఐగా ఉన్నప్పుడే ఆయన పై రాసలీలల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళతో రేగిన వివాదాన్ని పోలీస్ శాఖలో ఉన్న స్నేహితులతో షటిల్ చేసుకున్నరన్న ప్రచారం ఉంది. ఆయన పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు కొద్దిరోజులు వేకెన్సీ పెట్టిన సందర్భాలున్నాయి. నోట్ల రద్దు సమయంలో బ్యాంకు వద్ద ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అకారణంగా కొట్టి సస్పెన్షన్ కు గురయ్యారు. అటు తరువాత విధుల్లో చేరిన ఆయన ఎన్నికల ముందు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి తొడగొట్టారు.మీసాలు దువ్వి సవాల్ విసిరారు. వైసీపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించగలిగారు. ఎంపీ టిక్కెట్ పొంది విజయం సాధించారు. విపక్షాలపై అదే దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పడు నగ్న వీడియోతో అడ్డంగా బుక్కయ్యారు.

అంబటి, అవంతిలపై చర్యల మాటేమిటి?
అయితే ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలకు వైసీపీ హైకమాండ్ మల్లుగుల్లాలు పడుతోంది. ఆయనపై వేటు వేస్తే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విపక్షాల నుంచి విమర్శలు, ఆరోపణలు పెల్లుబికుతాయి. అంబటి, అవంతితో పోల్చుకుంటే మాధవ్ కు ఉన్న రాజకీయ నేపథ్యం చాలా తక్కువ. ఆర్థిక, అంగ బలం కూడా తక్కువే. ఎన్నికల ముందు వరకూ ఆయన కేవలం ఓ పోలీస్ అధికారి మాత్రమే. కేవలం జగన్ ఫొటో పెట్టకొని గెలవగాలిగారు. అందుకే అధిష్టానం వెంటనే స్పందించింది. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరంచింది. అయితే మాధవ్ పై చర్యలకు ఒకే.. మిగతా ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పార్టీలో సైతం చర్చనీయాంశంగా మారింది. అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడినట్టు ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆరోపణలు వచ్చాయి. కానీ అదంతా గొంతు మార్చి మాట్లాడినట్టు ఆయనచెప్పుకొచ్చారు. హైకమాండ్ కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అటు తరువాత సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి ఊడిపోయింది. తాజా మంత్రి అంబటి రాంబాబు పై కూడా సేమ్ ఆరోపణలు వచ్చాయి. మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. తెలుగునాట సంచలనం సృష్టించింది. కానీ ఆయన కూడా తన గొంతు కాదని చెప్పుకొచ్చారు. అధిష్టానం పట్టించుకోలేదు సరికదా… ఆయన ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టింది. అదే థర్టీ ఈయర్స్ పృధ్వీ విషయానికి వచ్చేసరికి మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. టీటీడీ భక్తి చానల్ చైర్మన్ గా నియమితులైన పృధ్వీ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్టు ఆరోపణలు రావడంతో వెనువెంటనే తొలగించారు.కానీ అవంతి, అంబటి ల విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉండడంతో హైకమాండ్ సైలెంట్ అయ్యిందన్న టాక్ అయితే ఉంది. ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ ను వారిద్దరి జాబితాలో చేర్చుతారో.. లేకుంటే రాజకీయ నేపథ్యం లేదు కదా చర్యలు తీసుకుంటే ఏంపోతుందని అనుకుంటారో చూడాలి మరీ…
Also Read:China- Taiwan: తైవాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా? అమెరికా కూడా దిగుతుందా?
[…] Also Read: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు త… […]