https://oktelugu.com/

Anupam kher- Ravi Teja: రవితేజ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత.. ఈసారైనా హిట్ కొడుతాడా?

Anupam kher- Ravi Teja: టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ కి మాస్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సుమారు 60 సినిమాల్లో ఆయన హీరోగా నటిస్తే అందులో 30 సినిమాలకు పైగా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..కానీ ఇటీవల కాలం లో రవితేజ ఒక హిట్ ఇస్తే వెంటనే అరడజను ఫ్లాప్స్ ఇచ్చేస్తున్నాడు..ఆయనకీ అలా ఫ్లాప్స్ రావడానికి కారణం కొత్త డైరెక్టర్స్ ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్లే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2022 / 12:44 PM IST

    Ravi Teja

    Follow us on

    Anupam kher- Ravi Teja: టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ కి మాస్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సుమారు 60 సినిమాల్లో ఆయన హీరోగా నటిస్తే అందులో 30 సినిమాలకు పైగా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..కానీ ఇటీవల కాలం లో రవితేజ ఒక హిట్ ఇస్తే వెంటనే అరడజను ఫ్లాప్స్ ఇచ్చేస్తున్నాడు..ఆయనకీ అలా ఫ్లాప్స్ రావడానికి కారణం కొత్త డైరెక్టర్స్ ని నమ్మి అవకాశాలు ఇవ్వడం వల్లే ..కథ చెప్పడం వేరు..చెప్పిన కథ ని చెప్పినట్టు తూచా తప్పకుండ తియ్యడం వేరు..రవితేజ కొత్త డైరెక్టర్స్ లో ఈ టాలెంట్ ని గుర్తించడం లోనే విఫలం అవుతున్నాడు..ఆయన వల్ల ఎంతో మంది డైరెక్టర్స్ పరిచయం అయ్యి నేడు ఇండస్ట్రీ లో టాప్ స్టార్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న విషయం వాస్తవమే..కానీ ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ అవ్వరు..అందుకే కొత్త డైరెక్టర్స్ తో ఎప్పుడైనా ఒక సినిమా చెయ్యాలి కానీ..వాళ్ళతోనే సినిమాలు చేసుకుంటూ పోతే కెరీర్ కి పెద్ద బొక్క పడుద్ది.

    Anupam kher

    క్రాక్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ చేసిన రెండు సినిమాలు అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి..క్రాక్ తర్వాత వచ్చిన సినిమా కావడం తో ఖిలాడీ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి..ఫుల్ రన్ లో కూడా యావరేజి అనిపించే రేంజ్ వసూళ్లను రాబట్టింది..కానీ ఆ సినిమా తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..అభిమానులు అయితే బహిరంగంగానే రవితేజ కి లేఖ రాస్తూ ఇలాంటి చెత్త సినిమాలను తియ్యొదు..నీ రేంజ్ ఏమిటో తెలుసుకో అన్నా అంటూ రవితేజ ని సోషల్ మీడియా లో టాగ్ చేసారు..ఈ సినిమా తర్వాత ఆయన టైగర్ నాగేశ్వర రావు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు..ఈ చిత్రం ద్వారా మరో నూతన డైరెక్టర్ వంశి ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు.

    Also Read: Sita Ramam Movie Review: సీతారామం రివ్యూ: యుద్ధాన్ని గెలిచిన ప్రేమ కథ

    Anupam kher

    ఈ సినిమా మీద అభిమానులకు కాస్త మంచి అంచనాలు అయితే ఉన్నాయి..ఎందుకంటే ఇది ఒక బయోపిక్..దానికి తోడు కాశ్మీ ఫైల్స్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమా ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది..ఇక కాశ్మీర్ ఫైల్స్ లో ప్రధాన పాత్ర పోషించిన జాతీయ అవార్డు గ్రహీత అనుపమ్ ఖేర్ గారు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు..ఇన్ని ప్రత్యేక ఆకర్షణలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా రవితేజ కి మరో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Also Read:Bimbisara Review: రివ్యూ – ‘బింబిసార’

    Tags