WiFi : ఇప్పుడు మొబైల్ వాడాలంటే బిల్ వాచి పోతుంది కదా. నెలకు మూడు నుంచి నాలుగు వందల రూపాయలు అవసరం అవుతున్నాయి. ఇక ఒక ఇంట్లో నాలుగు ఫోన్ లు ఉంటే ఏ రేంజ్ లో ఖర్చు అవుతుందో ఆలోచించండి. నెల జీతంలో కచ్చితంగా ఈ రీచార్జ్ లకు డబ్బును కేటాయించాల్సిందే. లేదంటే ఫోన్ వాడలేము. ఔట్ గోయింగ్ లేకపోయినా పర్వాలేదు. ఇన్ కమింగ్ అయినా ఒకే అనే విధంగా కూడా లేదు. ఔట్ గోయింగ్ సేవలు ముగిసిన రెండు మూడు రోజులకు ఇన్ కమింగ్ సేవలు కూడా ముగుస్తున్నాయి. సో చచ్చినట్టు రీచార్జ్ చేయాల్సిందే కదా. అయితే చాలా మంది ఇంట్లో వైఫై ఉంటుంది. వారికి కాస్త ఈ రీచార్జ్ ల నుంచి ఊరట లభిస్తుంది. ఎలాగంటే?
ఈ డిజిటల్ ప్రపంచంలో, చాలా పని ఆన్లైన్లో లేదా ఇంటర్నెట్ సహాయంతో సాధ్యమవుతోంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది ఇంటి నుంచి పని చేస్తారు. దీని కోసం వారు వైఫైని ఉపయోగిస్తారు. ఇక వైఫై ఉన్నప్పుడు మొబైల్ లో కొత్తగా రీచర్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకే టెలికాం కంపెనీలు కూడా వినియోగదారులకు తక్కువ డేటాను అందించే ప్లాన్లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, VI లలో మీకు ఎవరు చౌకైన కాలింగ్ ప్లాన్లను ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందామా?
ఎయిర్టెల్ రూ.1849 ప్లాన్
ఈ ప్లాన్ లో మీకు 365 రోజులు ఫ్రీగా మాట్లాడుకునే సౌకర్యం లభిస్తుంది. దీంతో పాటు మీకు 3600 SMS సౌకర్యం లభిస్తుంది. దీనితో పాటు, స్పామ్ కాల్ అలర్ట్, అపోలో 24/7 ఆరోగ్య సేవ, ఉచిత హెలోట్యూన్ వంటి అదనపు సేవలు కూడా ఇందులో కి వస్తాయి.
Also Read : ఫ్రీ వైఫై వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. మీ ఫోన్ ప్రమాదంలో పడ్డట్టే?
జియో రూ.1748 ప్లాన్
రిలయన్స్ జియో ఈ ప్లాన్ చెల్లుబాటు 336 రోజులు. దీనిలో, వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 3600 SMSలు లభిస్తాయి. అంతేకాదు వీటితో పాటు మీరు మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. అంటే జియో టీవీ, జియో AI క్లౌడ్ వంటి సేవలను కూడా పొందే అవకాశం ఉంటుంది.
Vi రూ. 1849 ప్లాన్
Vi ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత కాలింగ్, 3600 SMS సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. తక్కువ డేటా అవసరం ఉన్నవారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
బిఎస్ఎన్ఎల్ రూ.1199 ప్లాన్
ఈ ప్లాన్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటును అందిస్తుంది. ఈ రీచార్జ్ లో మీకు అన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి రోజు 100 SMS పొందే అవకాశం ఉంది. దీంతో పాటు మీకు 24GB డేటా కూడా అందుతుంది. మీరు ఈ ప్లాన్ తో గనుక రీచార్జ్ చేసుకుంటే మరిన్ని సౌకర్యాలను కూడా అందిస్తుంది ఈ ప్లాన్. అందుకే ఇంట్లో వైఫ్ ఉన్న వారు కేవలం కాలింగ్ మాత్రమే కావాలి అనుకునే వారికి ఈ ప్లాన్లు మీకు సరైనవిగా ఉంటాయి. దీనితో పాటు, ఈ ప్లాన్లలో మీకు SMS సౌకర్యం కూడా లభిస్తుంది.