ఇది హాట్ టాపిక్.. ‘డాక్టర్ లీ’ కి మగబిడ్డ…!

‘డాక్టర్ లీ వెన్లియాంగ్’ చైనాలో ఆప్తమాలజిస్ట్ వైద్యుడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసి, వైరస్ సోకిన వారికి వైద్యం అందించే క్రమంలో ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఫిబ్రవరిలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిన అసాధారణ హీరో డాక్టర్ లీ. లీ కరోనా గురించి మొదట్లో హెచ్చరించినప్పుడు.. అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. కానీ ఆ తర్వాత లీ […]

Written By: Neelambaram, Updated On : June 13, 2020 9:39 pm
Follow us on

‘డాక్టర్ లీ వెన్లియాంగ్’ చైనాలో ఆప్తమాలజిస్ట్ వైద్యుడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ను మొట్టమొదట గుర్తించి చైనాను అప్రమత్తం చేసి, వైరస్ సోకిన వారికి వైద్యం అందించే క్రమంలో ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకొని ఫిబ్రవరిలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిన అసాధారణ హీరో డాక్టర్ లీ. లీ కరోనా గురించి మొదట్లో హెచ్చరించినప్పుడు.. అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. కానీ ఆ తర్వాత లీ చెప్పిన మాటలే నిజమవడంతో.. చైనీయులు ఆయన్ను హీరో అంటూ కొనియాడారు. లీ హెచ్చరికలను పట్టించుకోని చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లీ చనిపోయే నాటికి గర్భంతో ఉన్న ఆయన భార్య.. తాజాగా ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు 3.45కి.గ్రా బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు.

ఈ విషయాన్ని డాక్టర్ లీ భార్య ‘ఫైనల్ గిఫ్ట్’ పేరుతో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ విచాట్‌ ద్వారా అందరితో పంచుకున్నారు. ‘నువ్వు స్వర్గం నుంచి చూడగలవా.. నాకు నువ్విచ్చిన చివరి బహుమతి ఈరోజు ఈ లోకంలోకి వచ్చింది. నేను మన బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ‘అని ఆమె పేర్కొన్నారు. ఆమె ఈ వార్త చెప్పడమే ఆలస్యం చైనీయుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. లీ వెన్లియాంగ్-ఫు జుజీకి కలిగిన రెండో సంతానంపై చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. ఆ చిన్నారి ఎప్పుడూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

వెన్లియాంగ్‌ కి కొడుకుకి పుట్టిన విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ సంబరపడిపోతున్నారు. ‘ఈరోజుకి నాకు అన్నింటికంటే ఇదే బెస్ట్ న్యూస్… ప్రజలు ఇంకా లీ వెన్లియాంగ్‌ ని మర్చిపోలేదు… తలుచుకుంటేనే దు:ఖం తన్నుకొచ్చినట్టు అనిపిస్తోంది.’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్.. ‘లీ వెన్లియాంగ్ స్ఫూర్తిని ఆయన కొడుకు కూడా కొనసాగిస్తాడని ఆశిద్దాం.’ అంటూ కామెంట్ చేశారు. గత ఫిబ్రవరిలో కరోనా కారణంగా మృత్యువాతపడ్డ లీ వెన్లియాంగ్‌ ను.. చైనీస్ ప్రభుత్వం కరోనాపై పోరులో ప్రాణ త్యాగం చేసిన వైద్యుడిగా గుర్తించి ఆయన కుటుంబానికి మెడల్ అందజేసింది.

చైనాలో ఆస్పత్రులకు క్యూ కడుతున్న ప్రజలను చూసి.. దేశంలో అంతుచిక్కని అసాధారణ పరిస్థితులేవో నెలకొన్నాయని లీ వెన్లియాంగ్ భావించాడు. తన ఆస్పత్రిలో చేరిన ఏడుగురు పేషెంట్లలో 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ లక్షణాలను గుర్తించాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తన మిత్రులతో పంచుకుని వారిని అప్రమత్తం చేశాడు. ఆ మెసేజ్‌ లు బయటకు లీకై వైరల్‌ గా మారడంతో.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు.