Modi Pune Visit Cancelled: మహారాష్ట్రలోని పూణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పూణె పర్యటన రద్దయింది. పూణెలో మెట్రో ప్రారంభోత్సవం తర్వాత ప్రధానమంత్రి బహిరంగ ర్యాలీ నిర్వహించాల్సిన ఎస్పీ కళాశాల క్యాంపస్‌లో భారీగా నీరు నిలిచిపోవడం, బురద ముద్ద కారణంగా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సివిల్ కోర్ట్ నుండి స్వర్గేట్ వరకు కలిపే నగరంలోని మెట్రో రైలు భూగర్భ విభాగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. స్వర్గేట్ నుంచి కత్రాజ్ వరకు నెట్‌వర్క్ విస్తరణకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి స్వర్గేట్ మధ్య అండర్ గ్రౌండ్ సెక్షన్ ఖర్చు సుమారు రూ.1,810 కోట్లు అని అధికారిక ప్రకటన తెలిపింది. ఈ భూగర్భ విభాగం ప్రారంభోత్సవం పూణే మెట్రో రైలు ప్రాజెక్ట్ (ఫేజ్–1) పూర్తయింది. దీనిని ప్రారంభించంతోపాటు పూణేలో మౌలిక సదుపాయాల పుష్‌తోపాటు, ప్రముఖ సంఘ సంస్కర్త జ్ఞాపకార్థం భిదేవాడలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే యొక్క మొదటి బాలిక పాఠశాల స్మారకానికి మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది.
పూపర్ కంప్యూటర్లు..
మోదీ తన పేణె పర్యటనలో జాతీయ సూపర్ కంప్యూటింగ్ మెషీన్ కింద సుమారు రూ.130 కోట్లతో తయారు చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేయాల్సి ఉంది. వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన కంప్యూటింగ్ సిస్టంను కూడా మోదీ ప్రారంభించాల్సి ఉంది. దీనికి రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
ఆరంజ్ అలర్ట్..
ఇదిలా ఉంటే.. పేణెలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని తెలిపింది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో..
మహారాష్ట్రలో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ అభివృద్ధిపనులపై దృష్టిసారించారు. భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే అక్కడ శివసేన చీలికవర్గంతో కలిసి బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మహరాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.