PM Kisan : రైతులకు కేంద్ర ప్రభుత్వం దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.2 వేలు.. అయితే ఇలా చేయండి..

కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతీ సంవత్సరం దేశంలోని రైతులకు రూ.6 వేలు అందిస్తుంది. ఇది మూడు విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రతీ విడతలో రూ.2 వేలు ఇస్తోంది. 18వ విడతకు సంబంధించిన రూ. 2 వేలు అక్టోబర్ 5న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది

Written By: Srinivas, Updated On : September 26, 2024 2:23 pm

PM Kisan

Follow us on

PM Kisan :  కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పెట్టుబడి సాయం కింద రైతులకు ప్రతీ ఏడాది అందిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులను అందించనుంది. ఇప్పటి వరకు 17 విడతలుగా అందించిన ప్రభుత్వం 18 వ విడతకు సంబంధించిన సాయం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతీ సంవత్సరం దేశంలోని రైతులకు రూ.6 వేలు అందిస్తుంది. ఇది మూడు విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రతీ విడతలో రూ.2 వేలు ఇస్తోంది. 18వ విడతకు సంబంధించిన రూ. 2 వేలు అక్టోబర్ 5న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు పట్టాభూమి ఉండి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులు పొందలేకపోతున్నారు. వారు ఎలా పొందాలంటే?

దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతీ సంవత్సరం రూ.6 వేల చొప్పున మూడు విడుదలుగా అందిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి విడద డబ్బులను విడుదల చేశారు. ఇప్పుడు అక్టోబర్ 5న రెండో విడతకు సంబంధించిన నిధులు రిలీజ్ చేయనున్నారు. అయితే చాలా మంది రైతులు వివిధ కారణాల వల్ల ఈ పథకం డబ్బలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ కైవేసీ అప్డేట్ చేయలేకపోవడం వల్లే వీరు ఈ పథకానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే పీఎఉం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ కేవైసీ పొందాలంటే ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ లోకి వెళ్లాలి. ఆ తరువాత ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేయడం ద్వారా దీనిని లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేయడం వల్ల ఈ కైవేసీ అప్డేట్ అవుతుంది. లేదా దగ్గర్లోని మీ సేవ కార్యాలయంలోని వెళ్లి కూడా ఈ కేవైసీ అప్టేడ్ చేసుకోవచ్చు. ఈ కైవేసీ అప్డేట్ చేసుకోవడం వల్లే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఈ కేవైసీ అప్టేట్ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు.

దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా మారిపోయారు. అయితే చాలా మంది ఇంకా ఈ కైవేసీ అప్డేట్ చేసుకుంటే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈ సాయాన్ని 10 వేలకు పెంచుతారన్న వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రూ.6 వేలు మాత్రమే అందిస్తోంది. అంతేకాకుండా ఒక కుటుంబంలో ఎంత భూమి ఉన్నా రూ.6 వేలు అందిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.