
YS Vivekananda Reddy Murder Case: ఎవరేమి అనుకున్నా నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉంది వైసీపీ ప్రభుత్వ తీరు. స్వంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ ప్రభుత్వానికి వివేకా కేసు పెద్ద సవాలుగా మారినా ఏ మాత్రం జంకులేనితనంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిపై ఉచ్చు బిగుసుకుంటుంది. విచారణకు హాజరైన ఆయనపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా వివేకా హత్య జరిగిన సమయంలో ఏం జరిగిందన్న దానిపైనే ఎక్కువ గా సమాధానాలు రాబట్టింది. వివేకా హత్య జరిగిన రోజు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ ఇంట్లో మీరు ఎందుకు ఉన్నారు. మరో నిందితుడు గంగిరెడ్డితో ఉన్న అనుబంధం తదితర విషయాలపై సమాధానాలు రాబట్టారు. దాదాపుగా 3 గంటలు విచారించారు.
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో అవినాష్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించింది. అయితే, దర్యాప్తు చేసేనాటికే పలు ఆధారాలు నాశనమయ్యాయని పేర్కొంది. కేసు విచారణ సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో టెక్నాలజీని వాడుకొని ముందుకెళ్తుంది. అంటే వివేకా హత్య జరిగిన రోజు ఎవరెవరు ఎక్కడున్నారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారు వంటి విషయాలను సెల్ ఫోన్లలోని జీపీఎస్ ఆధారంగా వివరాలను సేకరించి ఒక నివేదికను రూపొందించుకున్నారు.

ఏదేమైనా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ ప్రభుత్వానికి వైఎస్ వివేకా హత్య కేసు పెద్ద తలనొప్పిగా మారింది. అన్ని అంశాల్లో విఫలమయ్యారనే అపవాదు ఉంది. ప్రతిపక్షాలపై దాడులను కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అరాచకతవ్వ ఎక్కువైపోతుందని, అది వివేకా హత్య ఉదంతంతోనే మొదలైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ శ్రేణులు కూడా రెచ్చిపోవడం గమనించదగ్గ విషయం. చివరకు వివేకా కేసు జగన్ అండో కోకు ఏ దరికి చేర్చుతుందో వేచి చూడాల్సిందే.