
కర్ణాటకలో తాజాగా ఓ మంత్రి రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికేశాడు. ఆ వీడియోలు బయటపడి ఆ మంత్రి పరువు పోయింది. దాంతో పాటు మంత్రి పదవి పోయింది. తలెత్తుకోలేకుండా అయ్యాడు. ఒక మంత్రిగా ఉండి కూడా అంత సెక్యూరిటీ లైఫ్ లో ఇలా బయటపడడమే విడ్డూరం. అలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో చాలానే బయటపడ్డాయి. కానీ మన తెలుగు మంత్రి మాత్రం ఇలాంటి ఓ చిలక్కొట్టుడు వ్యవహారంలో బుక్కై అయ్యి కూడా సేఫ్ గా బయటపడడం విశేషం.. ఆయనపై మీడియాలో దావానంలా వార్తలు వచ్చినా చాకచక్యంగా మేనేజ్ చేసేశాడు. ఆ వార్త బయటకు రాకుండా కప్పేశాడు. అలాంటి వ్యవహారాలను ఎలా చేసి చూపించాలో రాసలీలల మంత్రులకు చూపించి ఆదర్శ ‘పురుషుడిగా’ నిలిచాడని సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు.. ఎవరా మంత్రి? ఏంటా కథ? అనేది ఆసక్తిగా మారింది.
ఆయనో మంత్రి.. తన ప్రత్యర్థి పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఇరికించడానికి పక్కాగా స్కెచ్ గీశాడు. ఓ అమ్మాయిని సెట్ చేసి సదురు జిల్లా అధ్యక్షుడితో క్లోజ్ గా మూవ్ చేయించారనే ఆరోపణలున్నాయి. ఆ వీడియోలు బయటపెట్టి జిల్లా అధ్యక్షుడి పదవిని ఊస్ట్ చేయించాడట. దెబ్బతిన్న ప్రత్యర్థి పార్టీ జిల్లా నాయకుడు ఊరుకుంటాడా? మంత్రిగారి రాసలీలలపై కన్నేశాడు. వేరే మహిళతో అక్రమ సంబంధాలను ఆరాతీశాడు. మంత్రి కాకముందు నుంచే సదురు నేత చిలక్కొట్టుడు వ్యవహారం కనిపెట్టి ఆమె ద్వారా మంత్రి గారి రాసలీలలు బయటపెట్టాడు.
అయితే రాష్ట్రానికి మంత్రిగా ఉన్న అతడి వ్యవహారాలు ఒక్కసారిగా అప్పట్లో మీడియాలో గుప్పుమన్నాయి. అధికార పార్టీ చానెల్ లోనే ఈ వార్త పతాక శీర్షిక అయ్యింది. దీంతో ముఖ్యమంత్రి ఈ మంత్రి పోస్ట్ ను ఊస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అంతా సెలైంట్ అయ్యారు? అటు సీఎం స్పందించలేదు. ఇటు సదురు ప్రత్యర్థి సైలెంట్ అయ్యాడు. మంత్రితో రాసలీలలు సాగించిన మహిళ కనిపించలేదు. ఏం జరిగింది? అంతా ఏమయ్యారు? అంటే మంత్రిగారు మేనేజ్ చేశారట..
మంత్రి కాకముందే జిల్లాలోని ప్రకృతి వనరులను దోచే వ్యాపారం చేసే సదురు మంత్రి వర్యులు దానిద్వారా కోట్లు సంపాదించారు. భారీ పరిశ్రమగా అది విస్తరించింది. సీఎం వచ్చినా.. ఇంకా ఎవరైనా మంత్రులు వచ్చినా ఆయన రాచమర్యాదలు చేస్తుంటారని జిల్లాలో కోడైకూస్తారు. ఆ జిల్లాలో మీడియా జర్నలిస్టులను అంతా మంత్రి గారు మేనేజ్ చేస్తుంటారట..
ఈ క్రమంలోనే మహిళతో రాసలీలల ఇష్యూ తన మంత్రి పదవికి ఎసరు వస్తుందని వెంటనే రంగంలోకి దిగి.. సదురు చానెల్ ను.. జిల్లా జర్నలిస్టులను మొత్తం మేనేజ్ చేశాడట.. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట.. మహిళను అజ్ఞాతంలోకి పంపి.. జర్నలిస్టులకు లక్షలు పంచేసి.. మీడియానే మేనేజ్ చేసి మొత్తానికి ఆ రాసలీలల ఇష్యూను తొక్కేశాడట.. ఇప్పుడా వార్తనే వినపడడం లేదు.. కనపడడం లేదు. మంత్రిగారా మజాకా. అధికార పార్టీ కూడా ఇప్పుడా ఇష్యూనే కెలకడం లేదు. అలా మేనేజ్ మెంట్ లో ఆ మంత్రి తోపు అనుకున్నాడు.
అయినా ఇలా పదవీ గండం తీసుకొచ్చే అలాంటి రాసలీలల వ్యవహారాలకు దూరంగా ఉంటే మంచిది కదా? అని పలువురు అంటే.. ఆ వీక్ నెస్ ఉంటే అంతే సామీ అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి మంత్రిగారు ఇప్పుడు ఏ మచ్చ లేకుండా గట్టిగానే నిలబడ్డారు. ఆ కర్ణాటక మంత్రియేమో అడ్డంగా వీడియోల్లో దొరికి పోస్ట్ పోగొట్టుకున్నాడు. ఏం తప్పు చేసినా మేనేజ్ చేసే తెలివి.. డబ్బు ఉంటే ఆ కథే వేరే ఉంటుందని మన తెలుగు మంత్రి చూపించాడట ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ గా కథలు కథలుగా చెప్పుకుంటున్నారట.. ఇది ఆనోటా ఈనోటా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కర్ణాటక మంత్రి ఇరుక్కున్నది చూసి మన మంత్రి ముందు పక్కరాష్ట్రం మంత్రి తెలివి ఎందుకు పనికిరాదని అంటున్నారు.. మన మంత్రినా మాజాకా..