Farm laws: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రైతులకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాట్టు తెలిపారు. ఆందోళనలు చేస్తున్న రైతులు తమ ఇళ్లకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో కొత్త జీవితం ప్రారంభించాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాల రద్దుకు రాజ్యాంగం ప్రకారం తీసుకోవాల్సిన ప్రక్రియ చేపడుతుమని చెప్పారు. ప్రధాని ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశ వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకున్నారు. ఇంతకీ రైతులు ఎందుకు ఈ మూడు చట్టాలను వ్యతిరేకించారు ? ఆ చట్టాల్లో రైతులు ఆందోళన పడే అంశాలున్నాయి. వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. టెక్నికల్ అంశాల జోలికి పోకుండా సులువుగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.

మొదటి చట్టం : ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ – 2020
ఈ చట్టం రైతులు ఉత్పత్తి చేసిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే మార్కెట్ కమిటలోనే కాకుండా రైతుకు ధర ఎక్కువ లభిస్తే అక్కడ పంట అమ్ముకోవచ్చు. దీనికి ఎలాంటి రుసుము విధించడం జరగదు.
రైతులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు ?
ఇలా ఎస్ఎంసీల బయట పంటను అమ్ముకోవడం ద్వారా కొన్ని రోజులకు మార్కెట్ కమిటీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యాపారులు రెండు, మూడేళ్లపాటు కావాలనే ఉత్పత్తిని అధిక ధరకు చెల్లించి కొనుగోలు చేసే చేస్తారు. దీంతో అందరూ ప్రైవేట్ వ్యాపారుల దగ్గరే పంటను అమ్ముకుంటే మార్కెట్ కమిటీలకు ఆదాయం రాదు. ఆదాయం లేకపోతే ఎస్ ఎంసీలను ప్రభుత్వం మూసేస్తుంది. తరువాత ప్రైవేట్ వ్యాపారులు ఎంత ధర చెబితే అంతకే రైతులు పంటను అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ చట్టం ద్వారా మద్దతు ధర అనేది ఉండదని రైతులు భయపడ్డారు.
రెండో చట్టం : ఫార్మర్స్ (ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్) అగ్రిమెంట్ ఆన్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ బిల్ – 2020
రైతు పండించిన పంటకు మార్కెట్ లో సరైన ధరలు లేనప్పుడు ఈ చట్టం రైతును రక్షిస్తుంది. రైతు నష్టపోకుండా కాపాడుతుంది. తాము పండించే పంటకు ముందుగానే వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో సాగు కంటే ముందే అమ్మకం ధర నిర్ణయించబడుతుంది.
రైతులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు ?
ఇది రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ లాభం చేకూరుస్తుందని రైతుల వాధన. మార్కెట్కు తీసుకెళ్లినప్పుడు దీని వల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని భావించారు. ధరలు పెరిగినప్పుడు ఇది రైతులకు ఇబ్బంది చేకూరుస్తుందని, వ్యాపారులతో బేరం ఆడే అవకాశం ఉందని అనుకున్నారు.
మూడో చట్టం : ఎస్సెన్షియల్ కమోడిటీస్ (అమెండ్మెంట్) బిల్ – 2020
నిత్యవసర వస్తువులైన తృణధాన్యాలు, ఉల్లి, బంగాలదుంప, పప్పులు వంటి వాటిని నిత్యవసర వస్తువుల జాబితా నుంచి తొలగించాలి. ఇలా చేయడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను ఎన్ని రోజులు అయినా నిల్వ ఉంచుకోవచ్చు. తమకు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. దేశంలో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దీనిపై ఆంక్షలు విధించాలి.
Also Read: Repeal of Agricultural Laws: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?
రైతులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు ?
ఇది చూడటానికి బాగానే కనింపించినా.. దీనిలో చాలా లోపాలు ఉన్నాయని రైతులు భావించారు. సామాన్య రైతు పంటను ఎలాగూ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోలేడు. బడా బడా వ్యాపారస్తులు పంటను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోగలడు. ఈ చట్టం ద్వారా వ్యాపారులు ఎన్ని రోజులు అయినా ఎలాంటి ఆంక్షలూ లేకుండా ఉత్పత్తిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులకంటే వ్యాపారులకే ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని భావించారు.
Also Read: Crying men: ఏడ్చే మొగాళ్లను నిజంగానే నమ్మకూడదా..? ఎందుకు..?