https://oktelugu.com/

Online movie ticket controversy:  ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లను ఎందుకు కంట్రోల్ చేస్తోంది.. సినీ పరిశ్రమ పాటిస్తుందా?

Online movie ticket controversy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకున్న సినిమా టికెట్ల రేట్ల వివాదం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. అన్ని సినిమాలకు ఒకే రేటు ఉండాలన్న నిబంధనలను పెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఆదేశాలు జారీ చేయడం టాలీవుడ్ పుండుమీద కారం చల్లినట్టైంది.. గత కొన్ని రోజుల నుంచే సినిమా టికెట్ల రేట్లపై […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2021 / 10:21 AM IST
    Follow us on

    Online movie ticket controversy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకున్న సినిమా టికెట్ల రేట్ల వివాదం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. అన్ని సినిమాలకు ఒకే రేటు ఉండాలన్న నిబంధనలను పెడుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో సినీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1 నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఆదేశాలు జారీ చేయడం టాలీవుడ్ పుండుమీద కారం చల్లినట్టైంది.. గత కొన్ని రోజుల నుంచే సినిమా టికెట్ల రేట్లపై సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు రూ.5 నుంచి రూ. 250 వరకు విక్రయించాలని తెలిపింది. ఆయా ప్రాంతాలను బట్టి రేట్లు ఉంటాయని తెలిపింది.

    movie tickets

    అయితే ప్రభుత్వం నిర్ణయంపై సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు వెండితెరకు దూరమయ్యారని, బుల్లితెర, ఆన్లైన్లో సినిమాలు చూస్తూ థియేటర్లకు రావడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు నిర్ణయిస్తే ఇక సినిమాలు తీసే వారి పరిస్థితి మరింత నష్టంగా తయారవుతుందని అంటున్నారు. కరోనా కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే సినిమాలు తీస్తూ కాస్త కుదుటపడుతున్న సమయంలో ప్రభుత్వం ఇలాంటి రేట్లను పెట్టడంపై విమర్శలు చేస్తున్నారు.

    కానీ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ ‘థియేటర్ల యజమానులు, సినిమా పరిశ్రమకు చెందిన వారితో చర్చించాం. వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారు. అలా సినిమా పరిశ్రమ కోరిక మేరకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. అలాగే ఇష్టారాజ్యంగా షో ల సంఖ్యను పెంచేసుకుంటూ పోతున్నారు. కేవలం నాలుగు షోలు మాత్రమే వేయాలి. అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. గతంలో పెద్ద హీరో సినిమాలకు రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయించారు. ఇప్పడు ఆ పద్ధతులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల ధర కూడా అదుపులోకి వస్తుంది’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.

    అయితే సినీ పరిశ్రమకు చెందిన పెద్ద నిర్మాతలు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడం ద్వారా మరింత నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. కానీ మరోసారి ప్రభుత్వంతో మాట్లాడి పునరాలోచించాలని అడుగుతామని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా త్వరలో 15 భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఇలాగే ఉంటే ఆ తరువాత సినిమాలు ఎవరూ తీసే పరిస్థితి ఉండదు. అన్నీ వంద రూపాయల్లోనే అయిపోవాలంటే సాధ్యం కాదు అని సినీ ప్రముఖులు ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వం ఎందుకు పెత్తనం చెలాయిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రశ్నించారు.

    Also Read: ఈ సినిమాలతో మనం కూడా టైం ట్రావెల్​ చేద్దామా?

    అయితే ఓ థియేటర్ యాజమాని మాట్లాడుతూ ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కార్పొరేషన్లలో పర్వాలేదు. కానీ బీ, సీ సెంటర్లలో రేట్లతో నిర్మాతలకు ఇబ్బందిగా మారుతుంది. సినిమా ఎక్కడైనా ఒకటే ఉంటుంది. అలాంటప్పుడు క్వాలిటీ థియేటర్లతో ధరలను నిర్ణయిస్తే బాగుంటుంది. ఉదాహరణకు బీ, సీ సెంటర్లలో అన్నీ హంగులతో ఉన్న థియేటర్లలో తక్కువ ధరకు టిక్కెట్లు విక్రియిస్తే నష్టమే కదా.. అటు ప్రేక్షకులు కూడా క్వాలిటీ లేకుండా చూపిస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది.  విశాఖలో ఎక్కువ రేటు పెట్టి సినిమా చూస్తారు..కానీ శ్రీకాకుళంలో చూడలేరు కదా.. ’ అని లాజిక్ తీస్తున్నారు. సినిమా పరిశ్రమలో కొందరితో గొడవలు ఉంటే వారితో చర్చించి పరిష్కరించుకోవాలి. కానీ సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఇలా బలి చేయడం కరెక్ట్ కాదని సినీ ఇండస్ట్రీ నుంచి వాదన వినిపిస్తోంది.

    Also Read: ఏపీ సర్కార్ కు భారీ జరిమానాలు.. షాక్ లాగా