Badradri – KCR : భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రావెందుకు కేసీఆర్ సార్?

Badradri – KCR : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాముల వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్ష ఈసారి కూడా కొనసాగింది. గతంలో 100 కోట్లు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటను నెరవేర్చుకోకపోగా.. తాజాగా సీతారాముల వారి కళ్యాణం రేపు అనగా కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతంతమాత్రపు ఆదాయంతో నెట్టుకొస్తున్న భద్రాచల రామాలయం.. ఎప్పటి లాగే ఈ ఏడు కూడా బ్రహ్మోత్సవాలను ముక్కీ మూలిగి […]

Written By: NARESH, Updated On : March 31, 2023 9:01 pm
Follow us on

Badradri – KCR : దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాముల వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్ష ఈసారి కూడా కొనసాగింది. గతంలో 100 కోట్లు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటను నెరవేర్చుకోకపోగా.. తాజాగా సీతారాముల వారి కళ్యాణం రేపు అనగా కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతంతమాత్రపు ఆదాయంతో నెట్టుకొస్తున్న భద్రాచల రామాలయం.. ఎప్పటి లాగే ఈ ఏడు కూడా బ్రహ్మోత్సవాలను ముక్కీ మూలిగి నిర్వహించింది. 2015, 2016 లో సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అప్పట్లోనే వంద కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఉన్నాయా పైసా కూడా విడుదల చేయలేదు.

వాస్తవానికి నిజాం నవాబుల కాలం నుంచే రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు.. ఇప్పటివరకు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక సార్లు రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. తెలంగాణ ప్రాంత వాసిగా ఉండి, దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం రాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించకపోవడం ఇక్కడ విశేషం.

30వ తేదీన కళ్యాణముంటే 29వ తేదీన డబ్బులు కేటాయించడం రాముల వారి పట్ల సీఎం నిజాయితీ ఏమిటో తెలుస్తుంది. కళ్యాణ మహోత్సవానికి రెండు కోట్ల 25 లక్షలు ఖర్చు అవుతాయని ఆలయ అధికారులు ఫిబ్రవరిలోనే సీఎంవో కు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదు. ప్రకటించిన కోటి రూపాయలు కూడా మంజూరు చేయలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రానికి కూడా రామాలయ ఖాతాలో ఆ డబ్బులు జమ కాకపోవడం విశేషం. మన ఇంట్లో రేపు పెళ్లి ఉంటే.. రోజు వస్త్రాలు కుట్టించుకుంటామా? అసలు కల్యాణానికి ఒకరోజు ముందు కోటి రూపాయలు మంజూరు చేయడం ఎలాంటి హిందుత్వానికి నిదర్శనమో కెసిఆర్ చెప్పాల్సి ఉంటుంది.

కెసిఆర్ భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు “డబ్బులు కేటాయించారు.. దర్శనానికి మాత్రం రారు”. రాముడంటే కెసిఆర్ కు లెక్క లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2017 నుంచి రాముల వారి కళ్యాణానికి సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు. ఈసారైనా వస్తారని దేవాలయ అధికారులు భావించారు. కానీ ఈసారి కూడా ముఖ్యమంత్రి రిక్తహస్తం చూపించారు.2016 లో ఇచ్చిన హామీ మేరకు 100 కోట్లు కేటాయింపు ఎప్పుడు చేస్తారో చెప్పాలని ఇక్కడి భద్రాద్రి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కి గతంలో ఎటువంటి హామీలు ఇచ్చారో, తెలంగాణ ఉద్యమంలో భద్రాద్రి రాముడి పై ఎలాంటి నినాదాలు చేశారో.. ఆ వివరాలను ఊటంకిస్తూ వరుస కథనాలు ఓకే తెలుగు పబ్లిష్ చేసింది. అయితే అప్పట్లో దీనిపై భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. త్రేతాయుగంలో కష్టాలు పడిన రాముడికి.. కలియుగంలోనూ ఆ బాధలు తప్పడం లేదు. పెద్ద హిందూ పాలిస్తున్న రాష్ట్రంలో.. రాముడికి ఈ బాధలు ఎప్పుడు తొలుగుతాయో ఏమిటో!!