CM Jagan Tollywood: చిత్ర పరిశ్రమ విషయంలో జగన్ సర్కారు మొండివైఖరి అవలంభిస్తోంది. పరిశ్రమ పెద్దలు పలుమార్లు జగన్ తో భేటీ అయినా ఆయన తీరులో మార్పు రావడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతోంది. సినిమాల విషయంలో జగన్ అనుసరిస్తున్న విధానంతో అందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం రాక్షసానందాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి అగ్ర నటులు వచ్చి జగన్ తో సమావేశమై చిత్ర పరిశ్రమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఇదంతా విన్న జగన్ సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. దీంతో సినిమాల భవితవ్యం అగాధంలో పడుతోంది.
Also Read: భీమ్లానాయక్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న జగన్ సర్కార్.. చాలా చోట్ల థియేటర్లు క్లోజ్
దీనికంతటికి పవన్ కల్యాణ్ కారణంగా తెలుస్తోంది. ఆయనపై ఉన్న కోపంతోనే మొత్తం పరిశ్రమను టార్గెట్ చేసుకోవడం తెలుస్తోంది. ఇదంతా జగన్ ప్రతిష్ట దిగజారేందుకే జరుగుతున్నట్లు తెలిసినా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా రంగం కుదేలైపోతున్నా నిర్లక్ష్యమే జగన్ సమాధానంగా చెబుతున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ సభ్యులు సైతం నిరాశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి జగన్ వ్యవహారంతో ఏపీ సినిమా పరిశ్రమ కోలుకోలేకపోతుంటే తెలంగాణ సినిమా కోసం అందిస్తున్న ఊతం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. సినిమా కోసం మంత్రి కేటీఆర్ అన్ని దారులు తెరుస్తున్నారు. వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమస్తున్నారు. దీంతో సినిమా వాళ్లు తెలంగాణను కీర్తిస్తున్నారు. మరోవైపు ఏపీని మాత్రం నిందిస్తున్నారు.
జగన్ అనుసరిస్తున్న విధానమే సినీ పరిశ్రమకు అడ్డుగా నిలుస్తోంది. అయినా ఆయన తన పంతం వీడటం లేదు. తాను అనుకున్నది చేయడానికే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దీనికి ప్రతిఫలం మాత్రం అనుభవించక తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: భీమ్లానాయక్ టికెట్ రేట్స్ చూస్తే మీ గూబ గుయ్ మంటది?