Homeజాతీయ వార్తలుKCR Delhi Tour: కేసీఆర్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?

KCR Delhi Tour: కేసీఆర్ తరుచూ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు?

KCR Delhi Tour:  ఇటీవల కాలంలో ఢిల్లీ పర్యటనకు తరచుగా వెళ్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా వెళుతూ దాన్ని అధికారిక పర్యటనగా చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా వైద్యం చేయించుకునేందుకు వెళుతూ దాన్ని రాష్ట్ర పర్యటనగా చూపిస్తున్నారనే వాదనాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం కూడా ఢిల్లీ వెళతారనే ప్రచారం సాగింది. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ వెళ్లేందు కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో పర్యటన వాయిదా వేసుకున్నారు.

KCR Delhi Tour
KCR Delhi Tour

ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని ధాన్యం కొనుగోలుపై రాజకీయం చేయలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే చీటికి మాటికి ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ఆయన అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. దీని కోసమే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ధాన్యం కొనుగోలుపై ట్వీట్ చేయడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగినట్లు తెలిసిందే.

Also Read: AP Cabinet Expansion: జగన్ కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు?

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ధాన్యం కొనుగోలుపై చర్చించాలని భావించారు. కానీ వారు అందుబాటులో ఉండటం లేదని తెలిసిందో ఏమో చివరిక్షణంలో పర్యటన రద్దు చేసుకున్నారు. తరువాత ఫాంహౌస్ కు వెళతారని అందరు అనుకున్నా ఆయన ప్రగతిభవన్ లోనే ఉండిపోయారు. ఢిల్లీ పర్యటనకు మరోసారి వెళ్లనున్నట్లు సమాచారం.

KCR Delhi Tour
KCR Delhi Tour

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతూ ప్రధానిని ఇతర మంత్రులను కలుస్తున్నా ప్రయోజనం మాత్రం ఉండటం లేదు. కానీ ఎందుకు పలుమార్లు వెళ్లడం అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయినా ఏదో సాధించినట్లు ఊరికే పర్యటనకు వెళ్లడం ఎందుకు అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ పలుమార్లు ఢిల్లీ వెళ్లడం ప్రభుత్వ ఖజానాకు చిల్లు పొడవడమే అని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి.

Also Read: KTR Tweets On Gujarat Power Cut: గుజార‌త్‌లో ప‌వ‌ర్ క‌ట్‌.. ఆటాడేసుకుంటున్న కేటీఆర్‌.. టైమింగ్ అంటే ఇదేనేమో..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Telangana Cabinet Expansion: తెలంగాణలో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. శాసనసభ సమావేశాలు, యాదాద్రి ఆలయ ప్రారంభం తదితర కార్యక్రమాలుండటంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టనున్నట్లు భావిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular