విమోచనాన్ని టీఆర్ఎస్‌ ఎందుకు పక్కన పెట్టినట్లు?

ఎన్నో ఏళ్ల కల.. ఎందరో త్యాగాల ఫలితం.. హైదరాబాద్‌ సంస్థానం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు. ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన రోజు. రాష్ట్రమంతట పండుగ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో టీఆర్‌‌ఎస్‌ మాత్రం ఆ సంబరాలను తూతూమంత్రంగానే జరిపింది. ఎప్పటినుంచో సెప్టెంబర్‌‌ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నా సీఎం కేసీఆర్‌‌ పెద్దగా ఖాతరు చేయలేదు. Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’! విమోచన దినోత్సవాన్ని […]

Written By: NARESH, Updated On : September 17, 2020 3:44 pm

trs vimochanam

Follow us on

ఎన్నో ఏళ్ల కల.. ఎందరో త్యాగాల ఫలితం.. హైదరాబాద్‌ సంస్థానం నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు. ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన రోజు. రాష్ట్రమంతట పండుగ వాతావరణం నెలకొన్న ఈ సందర్భంలో టీఆర్‌‌ఎస్‌ మాత్రం ఆ సంబరాలను తూతూమంత్రంగానే జరిపింది. ఎప్పటినుంచో సెప్టెంబర్‌‌ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నా సీఎం కేసీఆర్‌‌ పెద్దగా ఖాతరు చేయలేదు.

Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’!

విమోచన దినోత్సవాన్ని రాష్ట్రమంతటా ఇతర పార్టీలు నేడు పండుగా జరుపుతున్నాయి. కానీ.. టీఆర్‌‌ఎస్‌లో మాత్రం ఆ కళ కనిపించడం లేదు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నామమాత్రంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అటు జిల్లాలోనూ పెద్దగా కార్యక్రమాలు నిర్వహించలేదు.

తెలంగాణ ఉద్యమంలోనూ మన రాష్ట్రం మనకు వస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకుందామని చెప్పిన కేసీఆర్‌‌.. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఈ ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనడం లేదు..? బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా ఎంఐఎం నేతలకు భయపడే ఇలా చేస్తున్నారా..? మరే ఇతర కారణాలు ఉన్నాయా..?

Also Read: తల్లి సాహసం.. పిల్లలను కాపాడి తనువు చలింపు

తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌కు విముక్తి లభించిందంటే అది అందరికీ పండుగలాంటిదే. ఆది నుంచి హైదరాబాద్‌ మనది అని చెప్పుకునే టీఆర్‌‌ఎస్‌ నేతలంతా ఇప్పుడు తెలంగాణ విమోచన గురించి ఎందుకు మాట్లాడడం లేదనేది అర్థం కాని పరిస్థితి. కనీసం వచ్చటికైనా టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వంలో కదలిక వచ్చి అధికారికంగా వేడుక నిర్వహిస్తారని ఆశిద్దాం.