వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విజయసాయి..?

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అధికార పార్టీ ముఖ్య నేతల్లో ఒకరనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. న్యాయవ్యవస్థ వల్ల ఏపీ ఇబ్బందులు పడుతోందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేశారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాజ్యసభ ఎంపీ హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా…? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. Also Read : దుర్గగుడి  ఆ […]

Written By: Navya, Updated On : September 17, 2020 3:33 pm
Follow us on

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అధికార పార్టీ ముఖ్య నేతల్లో ఒకరనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. న్యాయవ్యవస్థ వల్ల ఏపీ ఇబ్బందులు పడుతోందంటూ విజయసాయి వ్యాఖ్యలు చేశారు. విజయసాయి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాజ్యసభ ఎంపీ హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా…? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

Also Read : దుర్గగుడి  ఆ మూడు సింహాలు ఆయన ఇంట్లోనే ఉంటాయి: మాజీ మంత్రి సంచలనం

విజయసాయి రాజ్యసభలో ఏపీ హైకోర్టు మీడియాపై ఆంక్షలు విధించడం గురించి మాట్లాడుతూ జగన్ సర్కార్ న్యాయ వ్యవస్థతోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని…. హైకోర్టు అసాధారణ చర్యలకు దిగుతోందని వ్యాఖ్యలు చేశారు. మీడియాపై, సోషల్ మీడియాపై మాజీ అడ్వకేట్ జనరల్ కు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్ ను రిపోర్టు చేయవద్దంటూ హైకోర్టు చెప్పడం సరికాదని అన్నారు.

రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టులలో జగన్ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మొట్టికాయలు పడుతున్న సంగతి తెలిసిందే. ఒకటీ అరా కేసులు మినహా దాదాపు అన్ని కేసుల్లో జగన్ సర్కార్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. వివాదాస్పద భూములను ఇళ్ల పట్టాలకు కేటాయించడంతో రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ అంతకంతకూ ఆలస్యమవుతోంది.

ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే బోధన జరగాలని తీసుకున్న నిర్ణయాన్ని సైతం కోర్టులు వ్యతిరేకించాయి. కేంద్రం కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 కూడా పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని పేర్కొంది. మూడు రాజధానుల విషయంలోనూ, నిమ్మగడ్డ విషయంలోనూ జగన్ సర్కార్ కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం. అయితే హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతున్నంత మాత్రాన విజయసాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Also Read : నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్….?