Rajasthan News: దేశంలో సరికొత్త మోసాలకు తెర లేపుతున్నారు. బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బు, నగదు దోచుకెళుతున్నారు. ఈ తరహా మోసాలు జరుతున్నా ప్రజల్లో ఇంకా అప్రమత్తత రావడం లేదు. దీంతో మోసపోయే వారున్నంత కాలం మోసం చేసే వారుంటూనే ఉంటారు. కొత్త పద్ధతులతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. అందినంత దోచుకుని ఉడాయిస్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకుంటున్నారు. చివరకు కటాకటాల పాలవుతున్నారు. మోసం ఎంతోకాలం దాగదనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.

రాజస్తాన్ లోని జాలోరో పట్టణానికి చెందిన అభిషేక్ జైన్ పెళ్లి చేసుకోవాలని సంబంధాల కోసం మనీషా సేన్ అనే పెళ్లిళ్ల బ్రోకర్ ను ఆశ్రయించాడు. ఆమె సీతాగుప్తా అనే సంబంధం చూపించింది. రెండు కుటుంబాలను కలిపింది. సీతాగుప్తా అందానికి ఫిదా అయిపోయిన అభిషేక్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కంటికి రెప్పలా చూసుకున్నా ఆమె తన చేతివాటం ప్రదర్శించింది. కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆమె దొంగ బుద్దిని చూపించింది. పెళ్లయిన 18 రోజులకే ఎవరు లేని సమయంలో ఇంట్లో నగదు, బంగారం మొత్తం సర్దుకుని ఉడాయించింది. దీంతో అభిషేక్ షాక్ కు గురయ్యాడు.
Also Read: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయమా.. పైసలు లేవు.. ప్రాజెక్టులు లేవు..!
ఇదేంటి నేను ఇంత ప్రేమగా చూసుకున్నా ఈమె ఎందుకు ఇలా చేసిందని అర్థం కాలేదు. కానీ చివరకు మాత్రం ఆమె ఓ దొంగ అని తేలిపోయింది. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె దొరకలేదు. దీంతో వారి రూట్లోనే వారిని పట్టుకోవాలని భావించారు. పెళ్లి కోసం అంటూ మాటలు కలిపి చివరకు పట్టుకున్నారు. దీంతో విషయం మొత్తం కూపీ లాగారు ఇలా ఎంత మందిని మోసం చేశారో కూడా తెలియడం లేదు. నయా మోసానికి తెర తీసిన సీతా గుప్తా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
సహజంగానే అందంగా ఉన్న సీతా గుప్తా మగాళ్లను మత్తెక్కిస్తూ వారిని పెళ్లి చేసుకుని కొద్ది రోజులు కాపురం చేసినట్లుగా నటించి తరువాత సమయం చూసుకుని అన్ని పట్టుకుని వెళ్లిపోవడం రివాజుగా మారింది. ఇందులో భాగంగానే పెళ్లిళ్ల బ్రోకర్ మనీషా సేన్ ఈమె కలిసి నయా మోసానికి నాంది పలికారు. రాష్ట్రంలో పెళ్లి కాని వారిని ఆశ్రయించి వివాహం చేసుకున్నట్లు నటించి వారి నుంచి డబ్బు దోచుకెళ్లడం చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో ఇవే అంశాలుంటాయా…?