KCR Politics: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?

KCR Politics: సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అంతకుమించి ముందడుగు వేయడానికి కాచుకొని కూర్చున్నదని అర్థం. ఇప్పుడు  రాజకీయాల్లో చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది. కేసీఆర్ చర్యలు అనూహ్యంగా ఉంటాయి. ఇప్పుడు జరిగిన పరిణామం కూడా చర్చనీయాంశమైంది.  తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిశాక కేసీఆరే స్వయంగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారని మీడియాకు వర్తమానం అందింది. అంతేకాదు.. ప్రత్యేకంగా హైదరాబాద్ లోని […]

Written By: NARESH, Updated On : January 18, 2022 5:04 pm
Follow us on

KCR Politics: సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. అంతకుమించి ముందడుగు వేయడానికి కాచుకొని కూర్చున్నదని అర్థం. ఇప్పుడు  రాజకీయాల్లో చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక అర్థం పరమార్థం ఉంటుంది. కేసీఆర్ చర్యలు అనూహ్యంగా ఉంటాయి. ఇప్పుడు జరిగిన పరిణామం కూడా చర్చనీయాంశమైంది.  తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిశాక కేసీఆరే స్వయంగా విలేకరుల సమావేశంలో పాల్గొంటారని మీడియాకు వర్తమానం అందింది. అంతేకాదు.. ప్రత్యేకంగా హైదరాబాద్ లోని పలువురు జాతీయ మీడియా చానెళ్ల రిపోర్టర్లకు కూడా తెలంగాణ సీఎంవో నుంచి సమాచారం వెళ్లింది. అందరు జర్నలిస్టులు హాజరు కావాలని అభ్యర్థించడంతో జాతీయ మీడియా ప్రతినిధులంతా సమావేశానికి వచ్చారు. సీఎంవో మీడియా మీనేజర్లు జాతీయ మీడియా రిపోర్టర్ లకు ఫోన్ చేసి మరీ కేసీఆర్ ప్రెస్ మీట్ కు రావాలని కోరారు. దీంతో కేసీఆర్ ఏదో బాంబు పేల్చుతాడని.. మోడీసర్కార్ కు వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయం చెబుతారని జాతీయ మీడియా జర్నలిస్టులు అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడూ వాట్సాప్ గ్రూపులో ఆహ్వానాలు పంపే తెలంగాణ సీఎంవో అధికారులు స్వయంగా ఫోన్లు చేసే సరికి జాతీయ మీడియా జర్నలిస్టులు సైతం ‘సమ్ థింగ్ రాంగ్’ అనుకున్నారట..

ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటిస్తారని.. థర్డ్ ఫ్రంట్ ను ప్రారంభించే కార్యక్రమాలను ప్రకటిస్తారని.. కేటీఆర్ నెక్ట్స్ సీఎం అని అందరూ అనుకున్నారట.. అందుకే సాయంత్రానికి చాలా మంది జాతీయ మీడియా రిపోర్టర్లు ప్రగతి భవన్ కు చేరుకొని చాలా ముందుగానే తమ సీట్లలో కూర్చున్నారు. బ్రేకింగ్ న్యూస్ ల కోసం రెడీగా ఉండాలని తమ జాతీయ డెస్క్ లను కూడా అప్రమత్తం చేశారట..

అయితే విలేకరుల సమావేశానికి కేసీఆర్ రాలేదు. సమయం గడిచినా తొంగి చూడలేదు. దీంతో సీఎంవో అధికారులను ఆరాతీయగా.. కేసీఆర్ ప్రెస్ మీట్ రద్దు చేసినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. కేబినెట్ మీటింగ్ లేట్ అవుతుందని.. మీరు వెళ్లిపోవాలని చెప్పారట..

కానీ కేబినెట్ మీటింగ్ అనుకున్న సమయానికే పూర్తయ్యిందని విచారణలో వెల్లడైంది. అయితే అందులో ఏం జరిగిందో కానీ.. కేసీఆర్ తాను ప్రెస్ మీట్ లో మాట్లాడబోనని మంత్రులకు చెప్పాడట.. రాత్రి 10 గంటల వరకూ మంత్రులను కూర్చోబెట్టి వారికి విందు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇంతకీ జాతీయ మీడియాతో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ పై జాతీయ నాయకులతో సమావేశాలు జరుపుతున్న కేసీఆర్ వైదొలగడానికి కారణం వారి నుంచి సరైన స్పందన రాలేదని ప్రచారం సాగుతోంది.

ఇక ప్రెస్ మీట్ రద్దు చేయడానికి మరో కారణం.. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలట.. కీలకమైన ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాక కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా అడుగులు వేయాలని.. బీజేపీ గెలిస్తే థర్డ్ ఫ్రంట్ వృథా అని ఇంటెలిజెన్స్ నివేదించిందట.. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని తేలిందట..

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తే బెటర్ అని.. ఇప్పుడే ప్రకటిస్తే ఒక వేళ బీజేపీ గెలిస్తే ఏ పార్టీ కూడా ముందుకు రాదని కేసీఆర్ డిసైడ్ అయ్యాడట.. జాతీయ రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించాలన్న తన ప్రయత్నాలు ఫలించవని కేసీఆర్ ప్రెస్ మీట్ కు దూరంగా ఉన్నారని తెలిసింది.

జాతీయ మీడియా జర్నలిస్టులు వస్తే ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర, ఎజెండా? పార్టీ లాంటి గురించి ఇబ్బంది కర ప్రశ్నలు ఎదురవుతాయి.. అందుకే చివరి క్షణంలో కేసీఆర్ వారిని ఎదుర్కోలేకనే ప్రెస్ మీట్ రద్దు చేసినట్టు మీడియా సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బీజేపీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఏదైన బలమైన వ్యాఖ్య చేసినా ఎదురుదెబ్బ తగలడం ఖాయమని.. కాబట్టి ఈ దశలో మౌనంగా ఉండి సరైన అవకాశం కోసం ఎదురుచూడడం మంచిదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారని ప్రచారం సాగుతోంది.