బీజేపీ ఎందుకు ఓడింది.. టీఆర్ఎస్ ఎందుకు గెలిచింది?

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు నాయకుడు.. ‘ఆయన మగాడ్రా బుజ్జీ’ ఈ సినిమా డైలాగ్ ను ఇప్పుడు కేసీఆర్ కు అప్లై చేస్తున్నారు విశ్లేషకులు.. కేసీఆర్ స్కెచ్ గీస్తే పారకుండా ఉంటుందా? ఫక్తు టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న గ్రాడ్యుయేట్లే ఆ పార్టీకి ఓటు వేయకుండా ఉంటారా? గెలుస్తామన్న బీజేపీకి ఇంతలా షాక్ తగలకుండా ఉంటుందా? మాయల మరాఠి.. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ మరోసారి తన రాజకీయ చాణక్యతను బయటపెట్టాడు. గెలుపు సంబరం నిన్న […]

Written By: NARESH, Updated On : March 21, 2021 11:04 am
Follow us on

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు నాయకుడు.. ‘ఆయన మగాడ్రా బుజ్జీ’ ఈ సినిమా డైలాగ్ ను ఇప్పుడు కేసీఆర్ కు అప్లై చేస్తున్నారు విశ్లేషకులు.. కేసీఆర్ స్కెచ్ గీస్తే పారకుండా ఉంటుందా? ఫక్తు టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్న గ్రాడ్యుయేట్లే ఆ పార్టీకి ఓటు వేయకుండా ఉంటారా? గెలుస్తామన్న బీజేపీకి ఇంతలా షాక్ తగలకుండా ఉంటుందా? మాయల మరాఠి.. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ మరోసారి తన రాజకీయ చాణక్యతను బయటపెట్టాడు.

గెలుపు సంబరం నిన్న కేసీఆర్ లో కనిపించింది. ఆయన వ్యూహాలు పారినట్టు ఆయన నవ్వుతున్న ఫొటోనే బయటపెట్టింది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో ఎగిరిపడిన బీజేపీ నేతల నోళ్లకు తాళాలు పడేలా కేసీఆర్ ఏం చేశారు? బీజేపీ ఎందుకు ఓడింది? టీఆర్ఎస్ ఎందుకు గెలిచింది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

*‘బండి’ స్పీడుకు బ్రేకులు..
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ దూకుడు మామూలుగా లేదు. ఆయన ఒక్కడై నడిపించాడు. లీడ్ చేశాడు.. బీజేపీని గెలిపించాడు. కాకరేపే మాటలతో ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీ అంటే ఢీ అన్నాడు. కానీ ఇప్పుడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి ఏమైందో కానీ బండి సంజయ్ మూగనోము స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి దూకుడు మామూలుగా లేదు.. ఏకంగా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని.. త్రిబుల్ రైడింగ్ యూత్ చేసుకోవచ్చని ఆయన అన్నమాటలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. టీఆర్ఎస్ ను ఢీకొట్టే దమ్మున్న నేత బండి అంటూ యూత్ , ప్రజలు కూడా అట్రాక్ట్ అయ్యి సీట్లు కట్టబెట్టారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి బండి సంజయ్ పర్యటనలు చేయలేదు.. యూత్ ను ఆకట్టుకునేలా వ్యవహరించలేదు. కనీసం పంచ్ డైలాగులు కూడా పేల్చలేదు. ఎందుకు బండి స్పీడుకు బ్రేకులు పడ్డాయి. కేంద్రంలోని బీజేపీ గమ్మున ఉండమందా? లేక కేసీఆర్ తో బీజేపీ తెరవెనుక స్నేహమా? లేక బీజేపీని కేసీఆర్ చావు దెబ్బ తీశారా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

*కేసీఆర్ స్కెచ్ గీస్తే అంతే..
కాంగ్రెస్ మాజీ ప్రధాని పీవీ కూతురును టీఆర్ఎస్ తరుఫున నిలబెట్టినప్పుడే అంతా అనుకున్నారు.. ఆమె గెలవదని.. బలి పశువును చేశారన్న విమర్శలు వినిపించాయి. కానీ అది కేసీఆర్ వేసిన ప్లాన్.. బీజేపీ ఎంత దూకుడుగా గ్రాడ్యూయేట్లను ఆకర్షించి వారిని అక్కున చేర్చుకున్నా కూడా కేసీఆర్ వ్యూహాల ముందు ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ వల్ల కాలేదంటే అర్థం చేసుకోవచ్చు. మేధావులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో టీఆర్ఎస్ పీకల్లోతు కోపం ఉంది. వారికి ఉద్యోగాలు , పీఆర్సీ లాంటి కోరికలను కేసీఆర్ తీర్చలేదు. కానీ చాకచక్యంగా హామీలిచ్చి భరోసా కల్పించి.. వారిని ఎలాగైనా సరే ప్రలోభపెట్టి విజయాన్ని అందుకున్న తీరు మాత్రం అభినందించాల్సిందేనన్న చర్చ సాగుతోంది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి ఆరోపించినట్టు ఓట్లు కొనేశారని.. ఫేక్ ఓటర్లను సృష్టించారని విమర్శలు గుప్పించినా.. చదువుకున్న గ్రాడ్యూయేట్లు మొత్తానికి మొత్తం ఓట్లను అమ్ముకునే రకం కాదు.. సో వారు స్వతహాగానే టీఆర్ఎస్ కు గుద్దేశారని తెలుస్తోంది. ఇక తీన్మార్ మల్లన్నకు ఓట్లు వేశారంటే గ్రాడ్యూయేట్లు ఆలోచించారనే చెప్పొచ్చు. సో ఎన్ని విమర్శలు చేసినా.. అంత మంది గ్రాడ్యూయేట్లను మేనేజ్ చేసి గెలిచారంటే నిజంగానే టీఆర్ఎస్ ను, కేసీఆర్ అభినందించాల్సిందే..

-నరేశ్.ఏ