హరిరామజోగయ్య మళ్లీ ఎందుకు బజ్జున్నాడు?

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఆయనది. వయసు 80 ప్లస్‌. ఆయనే మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య. వ‌య‌సు పెద్దదే అయినా.. ఆయన మ‌న‌సు మాత్రం యంగ్‌. ఉరుకులు ప‌రుగులు పెడుతున్న నాయ‌కుడిగా ఆయ‌న రాష్ట్రంలో గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన పాత్ర పోషించిన ఆయ‌న గురించి చెప్పాలంటే వృద్ధ నేత‌. ఇప్పుడు ప్రత్యక్ష రాజ‌కీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్దతు ప్రక‌టించారు. ఇక‌.. పార్టీ ఓట‌మి త‌ర్వాత […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 11:02 am
Follow us on


రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఆయనది. వయసు 80 ప్లస్‌. ఆయనే మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య. వ‌య‌సు పెద్దదే అయినా.. ఆయన మ‌న‌సు మాత్రం యంగ్‌. ఉరుకులు ప‌రుగులు పెడుతున్న నాయ‌కుడిగా ఆయ‌న రాష్ట్రంలో గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన పాత్ర పోషించిన ఆయ‌న గురించి చెప్పాలంటే వృద్ధ నేత‌. ఇప్పుడు ప్రత్యక్ష రాజ‌కీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌కు మ‌ద్దతు ప్రక‌టించారు. ఇక‌.. పార్టీ ఓట‌మి త‌ర్వాత మౌనంగా ఉండిపోయారు. అయితే.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో ట‌చ్‌లోనే ఉన్నారని టాక్‌. ప్రస్తుతం వృద్ధాప్య స‌మ‌స్యల‌తో ఇబ్బంది ప‌డుతున్న హ‌రిరామ జోగ‌య్య.. వాటన్నింటినీ దూరం పెట్టి ఇప్పుడు కాపుల కోసం ఉద్యమిస్తానంటూ ప్రకటించారు.

కొద్ది రోజుల క్రితం కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంలో హరిరామ జోగయ్య రంగంలోకి దిగారు. తాను కాపులకు అండగా నిలుస్తానని.. వారి హక్కులను పరిరక్షిస్తానని ముందుకొచ్చారు. ‘కాపు సంక్షేమ సేన‌’ పేరుతో ఆయ‌న ఓ ఉద్యమ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రక‌టించారు. కాపు యువ‌త అంద‌రూ వ‌చ్చి చేరాల‌ని కూడా పిలుపునిచ్చారు. దీనికి పార్టీల మ‌ద్దతు కూడా కూడ‌గడ‌తాన‌ని ప్రక‌టించారు. అయితే.. ఇది జ‌రిగి మూడు మాసాలైనా ఇప్పటివ‌ర‌కు జోగ‌య్య మళ్లీ దీని గురించి ప్రస్తావనం తీసుకురావడం లేదు.

ఏపీలోని కాపులు ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. కాపు సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించే వరకూ ఉద్యమాల ద్వారా జగన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు సంక్షేమ సేనను స్థాపించామని జోగయ్య అన్నారు. బీసీలకు ఎటువంటి నష్టం లేకుండా కాపుల్ని బీసీలుగా ప్రకటించడం.. లేదంటే ఓసీలలో 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించాలని చేగొండి హ‌రిరామ జోగ‌య్య అప్పట్లో డిమాండ్‌ చేశారు. కాపు సంక్షేమ సేనకు ఏ పార్టీకి సంబంధంలేదని ఒక సామాజిక వర్గానికి చెందినదని కాదన్నారు.

అది ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు మళ్లీ ఆ ఊసే ఎత్తకపోవడంతో సెటైర్లు వినిపిస్తున్నాయి. హరిరామ జోగయ్య మీద ఇప్పటికే పొలిటికల్‌లో పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎంతసేపూ సంచలనాల కోసం పాకులాడుతారని అంటుంటారు. గ‌తంలో ఆయన కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలిచారని.. త‌ర్వాత చిరంజీవి పార్టీ పెట్టగానే వైఎస్‌ను గట్టిగా టార్గెట్ చేస్తూ ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయార‌ని.. అక్కడ కూడా స్థిమితంగా రాజ‌కీయాలు చేయ‌లేద‌ని అంటున్నారు. త‌ర్వాత వైసీపీలో చేరి.. 2014లో ఈ పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌నసేన‌కు ద‌గ్గరైన చేగొండి హ‌రిరామ జోగ‌య్య . ఎన్నికల త‌ర్వాత మ‌ళ్లీ ప‌వ‌న్‌ను క‌లిశారు. ఇలా.. ఆయన అన్ని పార్టీలనూ చుట్టేస్తుంటారని.. ఒక్క పార్టీలో ఉండి పొందిన గుర్తింపు ఏమీ లేదని అంటుంటారు. ఇప్పుడు కూడా ఆయ‌న సంచ‌ల‌నాల కోస‌మే కాపుల ట్యాగ్ వాడుకుని ఉంటార‌నే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్