Karimnagar Review: కరీంనగర్ నియోజకవర్గం విస్తరణ విచిత్రంగా ఉంటుంది. ఇక్కడి ఓటర్లు కూడా విచిత్రమైన తీర్పునిస్తూ తమదైన శైలిలో నాయకులను ఎన్నుకుంటారు. మొదటి నుంచి విలక్షణ తీర్పునివ్వడం వీరి సహజ లక్షణం. అన్ని వర్గాల ఓట్లు ఉండటంతో ఏ పార్టీకి కూడా సుదీర్ఘ విజయం అందించలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ మూడు సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించి తన దైన ముద్ర వేసి మూడో సారికి మంత్రి పదవి దక్కించుకున్నారు.

ఈ సారి మాత్రం టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తుండటంతో ఆయన గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటంతో అధికార పార్టీకి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీ వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీకే నిర్వహించిన సర్వేలో గులాబీ పార్టీకి 24 మాత్రమే వస్తున్నట్లు వెల్లడైనట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గంగులకు ఎదురుగాలి తప్పేలా లేదు. ఈ క్రమంలో కరీంనగర్ నియోజకవర్గంపై బీజేపీ కూడా గురిపెట్టింది. కానీ మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండటంతో బీజేపీని గట్టెక్కనిస్తారో లేదో తెలియడం లేదు. దీంతోనే అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ సైతం ఓటమి పాలవడం తెలిసిందే. ప్రస్తుతం ద్విముఖ పోరు ఉండటంతో అధికార పార్టీ ఎంత మేర ప్రభావం చూపిస్తుందో అంతుచిక్కడం లేదు.
మరోవైపు కేసీఆర్ అందరి బలాబలాలపై సర్వే నిర్వహించి ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చాలా మంది ఓటమి అంచుల్లో ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో కేసీఆర్ కు తలనొప్పి పట్టుకుంది. పైగా కరీంనగర్ నియోజకవర్గం ప్రత్యేకతలు గలదని తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఇక్కడి ఎమ్మెల్యేలే ప్రధాన కారణం కావడం విశేషం.
Also Read: Telangana: కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న మోడీ.. తెర వెనక అసలు వ్యూహం ఇదే..!
దీంతో దీనిపై అందరికి గురి ఉంటుంది. అన్ని జాతుల సమ్మేళనం హైదరాబాద్ ఎలాగో కరీంనగర్ లో కూడా అన్ని జాతులు ఉండటం విశేషమే. దీంతో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే వారికి ప్రత్యేకత ఉండటం సహజమే. కానీ ఈసారి ఎమ్మెల్యేల పనితీరు బాగా లేక వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. దీంతో దిద్దుబాటు చర్యలకు చేపట్టినా వారి పరిస్థితి మారే సూచనలు కనిపించడం లేదు. అటు పనులు లేక ఇటు పథకాలు రాక ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం తెలుస్తోంది.
ఈ క్రమంలో కరీంనగర్ నుంచి పోటీకి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తోపాటు బీఎస్పీ కూడా రంగంలోకి దిగనుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీకి వస్తారో తెలియడం లేదు. బీఎస్పీ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారో కూడా అంతుచిక్కడం లేదు. దీంతో పోటీ తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంపై ఎవరి చూపు పడుతుందో అర్థం కావడం లేదు.
Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో ‘హైలెట్’ అంశం అదేనట?